కేసీఆర్ నిర్ణయంపై హైకోర్టులో పిటిషన్‌..!!

 

కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తుకు సిద్దమైన విషయం తెలిసిందే.. అయితే కేసీఆర్ తీసుకున్న అసెంబ్లీ రద్దు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో రాపోలు భాస్కర్ అనే న్యాయవాది పిటిషన్‌ను దాఖలు చేశారు.. ఇంకా 9 నెలల సమయం ఉండగా ముందే అసెంబ్లీని రద్దు చేయడంపై పిటిషన్‌లో ఆయన అభ్యంతరాలను వ్యక్తం చేశారు.. ఉన్నపళంగా అసెంబ్లీని రద్దు చేయడం వలన రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడుతుందని పేర్కొన్నారు.. 5 సంవత్సరాలు పూర్తి అయ్యేంత వరకూ ఎలాంటి ఎన్నికలు జరగకుండా హైకోర్టు ఆదేశాలు ఇవ్వాలని కోరారు.. ఈ పిటిషన్‌పై హైకోర్టు మంగళవారం విచారించనుంది.

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu