కర్ణాటక బరిలో దిగ్గజాలు

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ గురువారం(ఏప్రిల్ 20) నాటితో ముగిసింది. దేశ రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తించిన కర్ణాటక ఎన్నికల ప్రక్రియ రసవత్తరంగా సాగుతోంది. నామినేషన్ల ఉపసంహరణ చివరి గడువు ఈ నెల 24వ తేదీన ముగియనుంది.  పోలింగ్ తేదీ మే  పదో తేదీన ఉంటుంది.  కౌంటింగ్ తేదీ మే 13 నుంచి ప్రారంభం కానుంది.  

కర్ణాటకలో నామినేషన్ల ప్రక్రియ అధికారికంగా గురువారమే ముగిసినప్పటికీ బుధవారమే మెజార్టీ సభ్యులు నామినేషన్లు వేశారు. అధికారిక గణాంకాల ప్రకారం 1, 110 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మయ్, ప్రతిపక్ష నేత సిద్దరామయ్య, మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప కుమారుడు బి. విజయేంద్ర తదితరులు  బుధవారం తమ నామినేషన్లు సమర్పించే సమయంలో మెగా ర్యాలీలు, రోడ్ షోలు నిర్వహించారు.  మొత్తం 164 మంది బీజేపీ అభ్యర్థులు, 147 మంది కాంగ్రెస్  అభ్యర్థులు, 108 మంది జేడీఎస్ అభ్యర్థులు , 91 మంది ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులు , బీఎస్పి నుంచి 46 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు సమర్పించుకున్నారు. 1041 మంది పురుష అభ్యర్థులు, 69 మంది స్త్రీ అభ్యర్థులు నామినేషన్లు సమర్పించుకున్నారు. 
బీజేపీ యువ మోర్చా కార్యకర్త ఇస్మాయిల్ షఫీ బెల్లారే హత్య కేసులో ప్రధాన నిందితుడు కూడా పుత్తూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు నామినేషన్ సమర్పించుకున్నాడు. ప్రస్తుతం ఆయన జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. 
 ఇదిలా ఉండగా అభ్యర్థులు తమ నామినేషన్లు సమర్పించుకునే సమయంలో ఆస్తుల వివరాలు వెల్లడించారు. కర్ణాటక చిన్న తరహా పరిశ్రమల శాఖామంత్రి ఎంటీబీ నాగరాజ్ రాబోయే ఎన్నికల్లో సంపన్న అభ్యర్థిగా సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. 
 అతని ఆస్తి విలువ  రూ1,614కోట్లు అని తేలింది. బెంగళూరు రూరల్ జిల్లాలోని హోస్కోట్ నియోజకవర్గం నుంచి ఆయన బీజేపీ నుంచి పోటీ చేయనున్నారు. ఆయన ఈ సారి గెలుపొందితే  ఈ స్థానం నుంచి గెలుపొందడం ఇది నాలుగోసారి అవుతుంది. రెండో అత్యంత సంపన్న అభ్యర్థిగా డికే శివకుమార్ నిలిచారు. ఏడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన డీకే శివకుమార్ కనకపుర నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. ప్రస్తుతం ఆయన కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ గా వ్యవహరిస్తున్నారు. 
ప్రస్తుతం కర్ణాటకలో ఉద్యానవన శాఖ మంత్రిగా కొనసాగుతున్న మునిరత్న నాయుడు రాజరాజేశ్వరి నగర్ అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్నారు. 293 కోట్ల ఆస్తులతో, ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలలో అత్యంత సంపన్న అభ్యర్థిగా మూడో స్థానంలో నిలిచారు.
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్ డి కుమారస్వామి  తన ఆస్తుల విలువ రూ 181 కోట్ల రూపాయలు అని ప్రకటించారు. 2018లో కుమారస్వామి అతను ప్రకటించిన ఆస్తి విలువ కంటే రూ 14 కోట్లు పెరిగింది. 
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప కుమారుడు విజయేంద్ర ఆస్తి విలువ 126.18 కోట్ల రూపాయలు. ఆయన రాజకీయాల్లో రాకమునుపు న్యాయ వాద ప్రొఫెషన్లో ఉన్నాడు. 2020లొ అతను కర్ణాటక బీజేపీ ఉపాధ్యక్షుడి హోదాలో రాజకీయాల్లో వచ్చాడు తర్వాతి కాలంలో బిజేపీ యువమోర్చా ప్రధాన కార్యదర్శిగా పని చేశాడు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu