కన్నడ సినీ నటుడు దర్శన్ అరెస్ట్

బెంగళూరు: ప్రముఖ కన్నడ సినీ నటుడు దర్శన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. భార్య విజయలక్ష్మిపై దాడి చేసిన కేసులో ఆయన్ని విజయనగర పోలీసులు ఈరోజు తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు. విజయలక్ష్మి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్శన్‌ను నేడు కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉంది. తలకు తీవ్ర గాయాలు కావటంతో విజయలక్ష్మి ప్రస్తుతం గాయత్రి ఆస్పత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతుంది. గత ఏడాదిగా వీరిద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడటంతో ఆమె తన బిడ్డతో సహా తల్లిదండ్రుల వద్దే ఉంటోంది.