జగన్ అవినీతి పార్టీని నిలబెట్టుకోవడం అసంభవం బాబు
posted on Sep 9, 2011 10:07AM
హై
దరాబాద్: అవినీతికి తగిన ఫలితాన్ని వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కూడా అనుభవిస్తుందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. జగన్ తన అవినీతి పార్టీని నిలబెట్టుకోవడం అసంభవమని, జనం కూడా ఇలాంటి పార్టీని అంగీకరించరని భావిస్తున్నారు. ఆయన ఆత్మీయ సమావేశంలో భాగంగా ఎమ్మెల్యేలు దూళిపాళ్ల నరేంద్ర, జోగేశ్వర్‌రావు, సాయిరాజ్, రామానాయుడులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. భారీ అవినీతి కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న జగన్‌కు ప్రధాని అపాయింట్‌మెంట్ ఇవ్వడం తప్పని ఈ సందర్భంగా చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు తెలిసింది. గాలి జనార్దన్‌రెడ్డి అరెస్టుతో జగన్ పార్టీలో భయం నెలకొందని నేతలు చంద్రబాబుతో అన్నారు.