రిజర్వులో కనిమొళి బెయిల్
posted on May 31, 2011 9:24AM
న్యూఢిల్లీ: 2
జీ స్పెక్ట్రమ్ కుంభకోణంతో సంబంధం ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న డీఎంకే చీఫ్ కుమార్తె, రాజ్యసభ సభ్యురాలు కనిమొళికి సోమవారం బెయిల్ లభించలేదు. కనిమొళి పెట్టుకున్న బెయిల్ పిటీషన్‌పై తీర్పును ఢిల్లీ హైకోర్టు రిజర్వులో ఉంచింది. ఈ పిటీషన్‌పై సోమవారం తీర్పును వెలువరించాల్సి వుంది. అయితే, కోర్టు మాత్రం తీర్పును వెలువరించకుండా రిజర్వులో ఉంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కనిమొళిని మళ్లీ తీహార్ జైలుకు తరలించారు. సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయనే ఉద్దేశంతో సిబిఐ కోర్టు కనిమొళికి బెయిల్ నిరాకరించింది. 2జి స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో కనిమొళిని సిబిఐ సహ కుట్రదారుగా పేర్కొంటూ చార్జీషిట్ దాఖలు చేసింది. టెలికం మాజీ మంత్రి ఎ రాజాతో కుమ్మక్కయి కనిమొళి కలైంగర్ టీవి చానెల్ కోసం 214 కోట్ల రూపాయల లంచం తీసుకున్నారని సిబిఐ ఆరోపించింది. సిబిఐ కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కనిమొళి ఢిల్లీ హైకోర్టులో బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నారు. అలాగే, ఇదే కేసులో అరెస్టయి, బెయిల్ కోసం ఎదురు చూస్తున్న కలైంజ్ఞర్ టీవీ ఎండీ శరద్ కుమార్ బెయిల్ పిటీషన్‌పై కూడా తీర్పును రిజర్వులో ఉంచింది.