సాహసోపేత జర్నలిస్ట్ మృతి
posted on Mar 9, 2015 10:37AM

సాహసోపేత జర్నలిజానికి మారుపేరు, ఆంగ్ల వార్తాపత్రిక "ఔట్ లుక్" వ్యవస్ధాపకుడు, టీవీ వ్యాఖ్యాత వినోద్ మెహతా ఆదివారం కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఎన్నో గొప్ప గొప్ప పత్రికలు సండే అబ్జర్వర్, ఇండియన్ పోస్ట్, ది ఇండిపెండెంట్, ద పయనీర్(ఢిల్లీ ఎడిషన్) వంటివి ఆయనే ప్రారంభించారు. పాకిస్తాన్ లోని రావల్పిండిలో జన్మించిన ఆయన దేశ విభజన తరువాత లక్నోలో స్ధిరపడ్డారు. మెహతా భార్య సుమితా పాల్ కూడా జర్నలిస్టే. మెహతా మృతికి ప్రముఖ రాజకీయ నేతలు ప్రధాని మోదీ, కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, బీజేపీ నేత ఎల్‌కే అద్వానీ, కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, రవిశంకర్ ప్రసాద్ తదితరులు సంతాపం తెలిపారు. ఆయన అంత్య క్రియలు ఢిల్లీలో జరిగాయి.