విచ్చలవిడిగా రెచ్చిపోయిన జోగి రమేష్
posted on May 13, 2024 5:38PM
పోలింగ్ సందర్భంగా కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గంలో వైసీపీ నాయకులు ఎమ్మెల్యే అభ్యర్థి జోగి రమేష్ నాయకత్వంలో బీభత్సం సృష్టించారు. పెనమలూరు మండలం నిడమానూరు హైస్కూలు దగ్గర పోలింగ్ కేంద్రం దగ్గరకి తన అనుచరులతో వచ్చిన జోగి రమేష్ అక్కడ వున్న తెలుగుదేశం పోలింగ్ ఏజెంట్ల మీద దాడిచేశారు. ఆ తర్వాత తెలుగుదేశం నాయకుల ఇళ్ళ ముందుకు వెళ్ళి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. అలాగే నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ కేంద్రాలకు జోగి రమేష్ తన అనుచరులను పంపించి దొంగ ఓట్లు వేయించే ప్రయత్నాలు చేశారు. జోగి రమేష్ ప్రయత్నాలను తెలుగుదేశం వర్గాలు ఎక్కడికక్కడ అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ సందర్భంగా పలువురు తెలుగుదేశం కార్యకర్తలకు గాయాలయ్యాయి.