జాతీయ గీతానికి అర్థం తెలుసా? ఎన్ని సెకన్లు పాడాలో తెలుసా?

 

మన భారత జాతీయ గీతం జనగణమన... దీనిని రవీంద్రనాధ్ ఠాగూర్ రచించారు. 1911లో మొదటిసారి పాడిన ఈ గీతాన్ని 1950 జనవరి 24 వ తేదీన జాతీయగీతంగా రాజ్యాంగసభ స్వీకరించింది. ఈ గీతానికి సంగీతాన్ని కూడ ఠాగూర్  అమర్చారు. బాణీకి అనుగుణంగా ఈ గీతం పాడడానికి..52 సెకెండ్లు పడుతుంది. 

జాతీయగీతం..జనగణమన...

జనగణమన-అధినాయక జయ హే భారతభాగ్యవిధాతా!
పంజాబ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కళ బంగ
వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్ఛలజలధితరంగ
తవ శుభ నామే జాగే, తవ శుభ ఆశిష మాగే,
గాహే తవ జయగాథా।
జనగణమంగళదాయక జయ హే భారతభాగ్యవిధాతా!
జయ హే, జయ హే, జయ హే, జయ జయ జయ జయ హే।।

తెలుగు లో దీని అర్ధం...ఏమిటంటే...

పంజాబు, సింధు, గుజరాత్ మహారాష్ట్ర లతో కూడిన పశ్చిమ తీర ప్రాంతము
తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, తుళు భాషలతో కూడిన ద్రావిడ ప్రాంతము
ఒరిస్సా మొదలైన రాష్ట్రాలతో కూడిన తూర్పు తీర ఉత్కల ప్రాంతము
ఈశాన్య రాష్ట్రాలతో కూడిన బెంగాల్ ప్రాంతము..
వింధ్య హిమాలయ పర్వతాలు,
యమున గంగలు
పై కంటే ఎగసే సముద్ర తరంగాలు 
ఇవన్నీ..
తమరి శుభ నామమే తలుచుకుంటూ ఉన్నాయి
తమరి శుభ ఆశిస్సుల నే కోరుకుంటున్నాయి
తమరి విజయగాధనే పాడుకుంటున్నాయి
ఓ జనసమూహాల మనసుల అధినాయక.. మీకు జయము!
ఓ భారత భాగ్య విధాత, మీకు జయము! నిత్య జయము!

అర్ధమైంది కదా...ఇక మీదట జనగణమన పాడినప్పుడు దాని అర్ధాన్ని కూడా ఒక్కసారి మననం చేసుకోండి. ఎందుకంటే... ఈ తరంలో మనం గుర్తుపెట్టుకుంటేనే తర్వాత తరం వారికి సూటిగ చెప్పగలుగుతాం... గణ తంత్రదినోత్సవం పూట...ఈ గీతాలాపనం చేసుకోవటం తో పాటు... వాటి అర్ధాలు కూడా తెలుసుకోవటం మనకెంతో ఆనందాన్ని ఇస్తుంది.