పాక్ కు భారత్ గట్టి వార్నింగ్... ప్రతీకారం తీర్చుకుంటాం...!


జమ్మూ కాశ్మీర్ లోని పూంచ్ సెక్టార్ లో నియంత్ర‌ణ రేఖ వ‌ద్ద బీఎస్ఎఫ్‌కు చెందిన పోస్టులపై ఉగ్రవాదులు కాల్పులు జరపగా ఇద్దరు జవాన్లు మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే పాక్ అక్కడితో ఆగకుండా తమ క్రూరత్వాన్ని ప్రదర్శించి..జవాన్ల మృతదేహాలను ముక్కలుగా నరికేసి తమ పైశాచికాన్ని ప్రదర్శించింది. దీనికి గాను తీవ్ర ఆగ్రహం చెందిన భారత్ పాక్ గట్టి వార్నింగ్ ఇచ్చింది. కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ జరిగిన ఘటనపై స్పందించి...ఈ ఘటనపై తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. ఇదిలావుండగా, పాకిస్థాన్ దుర్మార్గంపై చూస్తూ ఊరుకోబోయేది లేదని సైన్యంలోని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఆ దేశానికి దిమ్మతిరిగే సమాధానాన్ని ఇస్తామని.. అది ఎప్పుడు, ఎక్కడ? అన్నది ఎల్ఓసీ వెంబడి విధుల్లో ఉన్న సైన్యానికే వదిలివేసినట్టు వెల్లడించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu