జమ్మూ కాశ్మీర్.. మళ్లీ రెచ్చిపోయిన ఉగ్రవాదులు

 

కొద్దిరోజులుగా భారత సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్తత కాస్త నెమ్మదించింది. అంతలోనే ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. మళ్లీ ఆర్మీక్యాంపులను లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటన అఖ్నూర్ సెక్టార్ లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. జమ్మూ కాశ్మీర్, అఖ్నూర్ సెక్టార్ లోని బతాల్ సమీపంలో ఉన్న జనరల్ రిజర్వ్ ఇంజినీరింగ్ ఫోర్స్(జీఆర్‌ఈఎఫ్) ఆర్మీక్యాంపుపై ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో క్యాంపులో పనిచేసే ముగ్గురు వ్యక్తులు మృతిచెందగా, మరికొందరికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఇక వెంటనే అప్పమత్తమైన ఆర్మీ ఎదురుకాల్పులు ప్రారంభించింది. ప్రస్తుతం ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య హోరాహోరీగా కాల్పులు కొనసాగుతున్నట్లు సమాచారం. మరోవైపు అఖ్నూర్ సెక్టార్‌లో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu