డిప్యూటీ సీఎం కాన్వాయ్‌పై రాళ్లతో దాడి....

 

ఐదు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్య్లూల్ విడుదలైన నేపథ్యంలో పార్టీలు ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రచారానికి వెళ్తున్న పంజాబ్ డిప్యూటీ సీఎం, అకాలీదళ్ నేత సుఖ్‌బీర్ సింగ్ కు చేదు అనుభవం ఎదురైంది. జలలాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం హాజరయ్యారు. అయితే సభ ముగించుకుని తిరిగి వెళ్తుండగా బాదల్ కాన్వాయ్‌పై  సుమారు 15 నుంచి 20 మంది వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. రాళ్ల దాడిలో నాలుగు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అయితే దాడికి పాల్పడింది మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలే అంటూ డిప్యూటీ సీఎం మద్దతుదారులు పేర్కొన్నారు. ఇక దీనిపై స్పందించిన  ఆప్ నేతలు ఆ దాడికి మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu