ఎట్టిపరిస్థితుల్లో అప్పుడే కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడతాం...

 

ఎన్డీయే ప్రభుత్వం ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. అయితే దీనికి ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు బడ్జెట్ ను ప్రవేశపెడితే.. పార్టీలకు ఎన్నికల తాయిలాలను బడ్జెట్ లో ప్రతిపాదించే అవకాశం ఉందని ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. అయితే ఎన్డీయే ప్రభుత్వం మాత్రం ఏది ఏమైనా ఫిబ్రవరి 1వ తేదీనే కేంద్రబడ్జెట్ ను ప్రవేశపెట్టాలని నిర్ణయించుకుంది. కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ కూడా దీనిపై స్పందించి ఫిబ్రవరి 1వ తేదీనే కేంద్రబడ్జెట్ ను ప్రవేశపెడతామని స్పష్టం చేశారు. బడ్జెట్ తేదీని మూడు నెలల క్రితమే ఖరారు చేశామని, బడ్జెట్ ను వాయిదా వేసే సంప్రదాయం ఎప్పుడూ లేదని జైట్లీ పేర్కొన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu