వారిసు, పీయ‌స్‌2ని బీట్  చేసిన జైల‌ర్‌!

జైల‌ర్ సినిమాకు ఆరు రోజుల్లో వ‌చ్చిన క‌లెక్ష‌న్లు చూసి వావ్ అంటున్నారు ట్రేడ్ పండిట్స్. ఈ క‌లెక్ష‌న్లతో ఆయ‌న విజ‌య్ వారిసు, మ‌ణిర‌త్నం పీయ‌స్‌2ని బీట్ చేసేశార‌ని అంటున్నారు. మంగ‌ళ‌వారం నేష‌న‌ల్ హాలీడే కావ‌డంతో జైల‌ర్ క‌లెక్ష‌న్లు అమాంతం పెరిగాయి. 350 కోట్ల రూపాయ‌ల‌ను క్రాస్ చేసింది ఈ సినిమా. ఈ ఏడాది ఇప్ప‌టిదాకా హ‌య్య‌స్ట్ గ్రాసింగ్ సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. ఈ ఫీట్‌ని కూడా వారం లోపే చేయ‌డం అభినందించ‌ద‌గ్గ విష‌యం.
మంగ‌ళ‌వారం జైల‌ర్‌కి 36.50కోట్లు డొమెస్టిక్ నెట్ క‌లెక్ష‌న్ వ‌చ్చింది. సోమ‌వారం వ‌చ్చిన 23.55 కోట్ల‌తో పోలిస్తే ఇది 55 శాతం ఎక్కువ‌. అందులో 26.70 కోట్లు కేవ‌లం త‌మిళ్ వెర్ష‌న్ నుంచే వ‌చ్చాయి. ఇండియాలో దాదాపు 81 శాతం ఆక్యుపెన్సీతో ఈ మూవీ న‌డుస్తోంది. ఆరు రోజుల టోట‌ల్ డొమెస్టిక్ నెట్ క‌లెక్ష‌న్ రూ.210కోట్లు. డొమెస్టిక్‌గా 300 నుంచి 350 కోట్ల‌ను ఈజీగా దాటేస్తుందే అంటున్నారు బిజినెస్ ఎక్స్ పెర్ట్స్.
ఓవ‌ర్‌సీస్‌లోనూ ఈ సినిమాకు చాలా మంచి క‌లెక్ష‌న్లు వ‌స్తున్నాయి. కొన్ని దేశాల్లో అయితే షారుఖ్ ప‌ఠాన్‌కి వ‌చ్చిన క‌లెక్ష‌న్ల క‌న్నా, జైలర్ సినిమాకు మంచి నెంబ‌ర్స్ క‌నిపిస్తున్నాయి.
ఆరు రోజుల్లో గ్లోబ‌ల్ గ్రాస్ 392 కోట్లను ట‌చ్ చేసింది. ఈ ఏడాది మ‌ణిర‌త్నం పొన్నియిన్ సెల్వ‌న్ 2 కి 345 కోట్ల గ్రాస్ వ‌చ్చింది. విజ‌య్ వారిసుకు 306 కోట్ల గ్రాస్ వ‌చ్చింది. ఈ నెంబ‌ర్ల‌ను కేవ‌లం ఆరు రోజుల్లోనే ర‌జ‌నీకాంత్ జైల‌ర్ దాటేసింది. టాప్ ఫైవ్ హ‌య్య‌స్ట్ గ్రాసింగ్ త‌మిళ్ సినిమాల ఆల్ టైమ్ కేట‌గిరీలోనూ జైల‌ర్ ఎంట్రీ ఇచ్చేసింది. ఇప్ప‌డు నాలుగో స్థానంలో ఉంది జైల‌ర్‌. 2.0కి 744కోట్లు, పొన్నియిన్ సెల్వ‌న్ 1 కి 488 కోట్లు, విక్ర‌మ్‌కి 414 కోట్లు, వ‌చ్చిన‌ట్టు రికార్డుల్లో ఉంది.
ఈ లెక్క‌న, జైల‌ర్ క‌లెక్ష‌న్ల‌ను, ర‌న్‌ని బ‌ట్టి చూస్తే, అతి త్వ‌ర‌లోనే విక్ర‌మ్‌, పొన్నియిన్ సెల్వ‌న్‌1ని దాటేస్తుంద‌నే అంచ‌నాలున్నాయి. అదే జ‌రిగితే, నెంబ‌ర్ వ‌న్‌లో 2.0తో ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న ర‌జ‌నీ, ఇప్పుడు జైల‌ర్‌తో సెకండ్ ప్లేస్‌ని కూడా ఆక్యుపై చేస్తార‌న్న‌మాట‌.