పవన్ పై జగన్ దూషణలకు కారణమదేనా?

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. బుధవారం (ఏప్రిల్ 17) స్వామివారిని 58 వేల690 మంది దర్శించుకున్నారు. వారిలో 20 వేల 744 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.  స్వామి వారి హుండీ ఆదాయం 3 కోట్ల రెండు లక్షల రూపాయలు వచ్చింది.  ఇక గురువారం (ఏప్రిల్ 18)  ఉదయం స్వామివారి ఉచిత దర్శనం కోసం రెండు కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామి వారి ఉచిత దర్శనానికి ఆరు గంటల సమయం పడుతోంది. అలాగే టైమ్ స్లాట్ దర్శనం కోసం భక్తులు ఒక కంపార్ట్ మెంట్ లో వేచి ఉన్నారు. టైం స్లాట్ భక్తులకు శ్రీవారి దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. ఇక 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. 

పవన్ పై జగన్ దూషణలకు కారణమదేనా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్  ప్రత్యర్థులపై కక్ష సాధింపు ధోరణిలోనే వ్యవహరిస్తారన్నది ఈ ఐదేళ్లుగా ఆయన తీరు చూసిన అందరికీ  అవగతమైంది. అయితే జనసేనాని పవన్ కల్యాణ్ పై జగన్ రెడ్డికి ప్రత్యేక కోపం ఉందని కూడా అర్ధమౌతోంది. కనీసం పవన్ కల్యాణ్ పేరు కూడా ఉచ్ఛరించకుండా దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్ అని ప్రస్తావిస్తూ పవన్ పై వ్యక్తిగత దూషణలకు పాల్పడడాన్ని చూస్తునే ఉన్నాం. జగన్ మోహన్ రెడ్డికి జనసేనాని పవన్ కల్యాణ్ పట్ల అంతటి వ్యతిరేకత ఎందుకు. సాధారణంగా రాజకీయ నాయకులు పాటించాల్సిన కనీస సంయమనాన్ని కూడా పాటించకుండా పవన్ పై వ్యక్తిగత దూషణలకు సైతం తెగపడేంత ద్వేషభావం ఎందుకు?  అన్న ప్రశ్నకు పదేళ్ల వెనక్కు ఒక్కసారి వెళ్లాల్సి ఉంటుంది. ఔను నిజమే.. రాష్ట్ర విభజన తరువాత జరిగిన తొలి ఎన్నికలలో అంటే 2014లో తన పార్టీ ఓటమికి అధికారానికి దూరం కావడానికి పవన్ కల్యాణే కారణమని జగన్ విశ్వసిస్తున్నారు. పవన్ కల్యాణ్ పొలిటికల్ ఎంట్రీ అప్పుడు లేకపోయి ఉన్నట్లైతే అప్పుడే వైసీపీ అధికారంలోకి వచ్చి ఉండేదని జగన్ భావనగా ఆయనకు సన్నిహితంగా ఉండే వారు ఇప్పటికీ చెబుతున్నారు. 

అయితే వాస్తవానికి విభజనతో అన్నిందాలా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ను గాడిన పెట్టే అనుభవం, దార్శనికత ఉన్న వ్యక్తిగా ఏపీ జనం చంద్రబాబును విశ్వసించారు కనుకనే ఆయన విజయం సాధించారన్నది విశ్లేషకులు మాట. విశ్లేషకుల మాట ఎలా ఉన్నా కేవలం పవన్ కల్యాణ్ అప్పట్లో తన పార్టీని ఎన్నికల బరిలో దించకుండా చంద్రబాబుకు మద్దతు పలకడం వల్లనే వైసీపీ పరాజయం పాలైందని జగన్ గట్టిగా నమ్ముతున్నారు. 2019 ఎన్నికలలో పవన్ పోటీలోకి దిగారు. పొత్తులు లేకుండా ఒంటరిగానే పోటీ చేశారు. దీంతో ఆ ఎన్నికలలో వైసీపీ ఘన విజయం సాధించింది. ఇప్పుడు మళ్లీ 2014 నాటి పొత్తులు పొడవడంతో ఓటమి తప్పదన్న భయంతోనే ఆయన పవన్ కల్యాణ్ పై ఇష్టారీతిన వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తున్నారనీ, దూషణలకు తెగబడుతున్నారనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పవన్ పేరు ప్రస్తావించడానికి కూడా జగన్ ఇష్టపడటం లేదనీ, ఎప్పడు పవన్ ప్రస్తావన వచ్చినా ప్యాకేజీ స్టార్, దత్తపుత్రుడు అనే సంబోధిస్తున్న సంగతి తెలిసిందే.  

సాధారణంగా రాజకీయ నాయకులు తమ విమర్శలలో ప్రత్యర్ధుల వ్యక్తిగత విషయాలను ప్రస్తావించకుండా నియంత్రణ పాటిస్తారు. మర్యాద రేఖ దాటకుండానే విమర్శలు చేస్తారు. కానీ ముఖ్యమంత్రి మాత్రం అటువంటి నియంత్రణ అనేదే లేకుండా పవన్ కల్యాణ్ వివాహాలపై ఇష్టారీతిన వ్యాఖ్యలు చేస్తుంటారు. 
అయితే ఇటీవల ఓ రెండు నెలల కిందట జనసేనాని తనకు  జగన్ నాలుగో భార్యా అంటూ ఘాటుగా రిటార్డ్ ఇవ్వడంతో వైసీపీ అధినేత కొంచం వెనక్కు తగ్గారు. ఈ రెండు నెలలుగా పవన్ కల్యాణ్ వివాహాలపై ఎటువంటి కామెంట్లూ చేయకుండా నియంత్రణ పాటించారు. అయితే మనమంతా సిద్ధంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆయన మళ్లీ నియంత్రణ కోల్పోయి జగుప్పాకరమైన భాషలో పవన్ వివాహాలపై వ్యాఖ్యలు చేశారు. దీంతో పరిశీలకులు గోదావరి జిల్లా వేదికగా జగన్ పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై తమదైన విశ్లేషణలు చేస్తున్నారు. 

గోదావరి జిల్లాలలో కాపు సామాజికవర్గం, బీసీ సామాజిక వర్గాల మధ్య స్వతహాగా ఉండే వైరాన్ని దృష్టిలో ఉంచుకుని బీసీలను దగ్గర చేసుకునే వ్యూహంతో జగన్  ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారంటున్నారు.  అయితే పవన్ పై అనుచిత, దిగజారుడు వ్యాఖ్యలు  జగన్ ఆశించిన ఫలితాన్ని ఇవ్వవని చెబుతున్నారు. తెలుగుదేశం కూటమిలో భాగస్వామిగా ఉన్న జగన్ కు  ఇటు కాపుల మద్దతు, అటు బీసీల మద్దతూ కూడా ఉందనీ, ఆ కారణంగా జగన్ వ్యాఖ్యల కారణంగా వైసీపీకే నష్టం వాటిల్లుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.