జగన్ ని కలిసిన విజయమ్మ,భార్య భారతి
posted on May 29, 2012 3:56PM
వైయస్ జగన్ ని ఈరోజు చంచల్‌గూడ జైలులో జగన్మోహన్ రెడ్డిని ఆయన తల్లి, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ, భార్య భారతి, సోదరి షర్మిళ మంగళవారం ఉదయం కలిశారు. నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఆడిటర్ విజయ సాయిరెడ్డి, బ్రదర్ అనీల్ కుమార్, గంగిరెడ్డి తదితరులు జగన్కు కలిసేందుకు జైలు అధికారులు అనుమతి ఇచ్చారు. వైయస్ జగన్ లేని లోటును విజయమ్మ తీరుస్తారని మేకపాటి రాజమోహన్ రెడ్డి చెప్పారు. జగన్ చాలా ధైర్యంగా ఉన్నారన్నారు. ఉప ఎన్నికలలో అన్ని సీట్లను తామే గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఇతర పార్టీల నుండి తమ పార్టీలోకి వలసలు ఆపేందుకు కుట్ర జరుగుతోందన్నారు. జైలు జీవితం జగన్‌ను ఇబ్బంది పెట్టదన్నారు. ఉప ఎన్నికలలో ప్రచారానికి దూరం చేసే కుట్రతోనే జగన్‌ను అరెస్టు చేశారన్నారు. ఉప ఎన్నికల సమయంలో జగన్ అరెస్ట్ మాకు నష్టమే అయినా భర్తీ చేస్తామన్నారు.