లగడపాటి రాజగోపాల్ రిసార్ట్‌లో పేలుళ్లు
posted on May 29, 2012 2:46PM
విజయవాడ ఎమ్.పి లగడపాటి రాజగోపాల్ కు హైదరాబాద్ శివారు కొండాపూర్ లో ఉన్న రిసార్ట్స్ భవనంలో గిలిటెన్ స్టిక్స్ పేలడంతో భవనంలో ని కొంత భాగం స్వల్పం దెబ్బతింది. అయితే రెండు నెలలుగా ఇది వాడుకలో లేదు. కేవలం వాచ్‌మెన్ మాత్రమే అందులో నివాసం ఉంటున్నారు. గత వారం శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత రిసార్టులో ఒక్కసారిగా జిలెటిన్ పేలుళ్లు జరిగాయి. ఈ విషయాన్ని వాచ్‌మెన్ పోలీసులకు చెప్పారు. జిలెటిన్ పేలుళ్ల కారణంగా ప్లాసిడా రిసార్ట్ పాక్షికంగా దెబ్బతిన్నది. సంఘటన స్థలంలో తెలంగాణవాదుల పేరిట కరపత్రాలు దొరికాయి. దీనిపై రాయదుర్గం పోలీసులు విచారణ జరుపుతున్నారు.తన రిసార్టులో పేలుళ్లకు కారణం తెలంగాణవాదులు కాదని, వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గీయులే అని అనుమానం వ్యక్తం చేశారు.