జ‌గ‌న్‌కు త‌న‌వారి సెగ‌! ప‌రువు చిత్రం చూపిన మంత్రులు,ఎమ్మెల్యేలు!

అంద‌రూ క‌లిసిక‌ట్టుగా చేయాల‌నుకుని ప్ర‌మాణం చేసుకున్న‌పుడు దానికి క‌ట్టుబ‌డే వుండాలి. కాల‌క్ర‌మం లో అంతా నేనే అంటూ అంద‌రిమీదా పూర్తి అజ‌మాయిషీ చేస్తే పూర్తిగా లొంగిపోయి, భ‌య‌ప‌డుతూ ఎవ‌రు ఎన్నాళ్లు ప‌నిచేస్తారు. ముందు బాగానే వున్నా ఆన‌క అస‌లు రంగు బ‌య‌ట‌ప‌డుతున్న‌పుడు త‌గు జాగ్ర‌త్త లు తీసుకోవ‌డానికి ప్ర‌య‌త్నించ‌డంలో త‌ప్పులేదు. ఏదో ఒక సంద‌ర్భంలో, ఏదో  ఒక  అంశంపై అభి ప్రాయభేదాలు రావ‌డం, వ్య‌తిరేక‌త‌ను అనాస్త‌త‌ను చూచాయిగా అయినా వ్య‌క్తం చేస్తారు. కానీ  అదీ ప‌ట్టిం చుకోని ప‌రిస్థితుల్లో ఇహ గ‌ట్టిగానే  విన‌ప‌డేట్టు వ్య‌తిరేక‌త వెల్లువెత్త‌డం వారి స్నేహం ఏ స్థాయిలో దెబ్బ తిన్న‌ది స్ప‌ష్టం చేస్తుంది. ఇది మామూలు స్నేహ‌మ‌యితే ఫ‌ర‌వా ఇల్లే.  ఇదంతా జ‌రిగింది ఆంధ్ర‌ప్రదేశ్ సీఎం జ‌గ‌న్ రెడ్డి స‌మ‌క్షంలోనే వారి మంత్రులు, ఎమ్మెల్యేల మ‌ధ్య త‌లెత్తిన విభేదాలు. మొన్న జ‌రిగిన వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యుల‌తో జ‌రిగిన ప్ర‌త్యేక స‌మావేశంలో రాష్ట్రంలో ప్ర‌భుత్వం తీరు తెన్నులు, వైసీపీ గురించి ప్ర‌జ‌ల్లో వున్న అభిప్రాయంలో తెలుసుకోగోరేరు. కానీ  పార్టీ అధినేత‌, ముఖ్య మంత్రి జ‌గ‌న్ ఉప‌న్యాసంలో మంత్ర‌లు, ఎమ్మెల్యేలు ఊహించిన స్థాయికి ప‌నిచేయ‌డం లేద‌ని కాస్తంత కోప‌గించారు. అందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు నిమ్మ‌కుండ‌లేదు. వారూ  ధైర్యం చేసి వారు ఎదుర్కొం టున్న ప‌రిస్థితుల‌ను, అస‌లు ప్ర‌భుత్వానికి ప్ర‌జ‌ల్లో వున్న వీరాభిమానం ఏపాటిద‌నేది కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. 

జ‌గ‌న్‌కి విన‌డం అంత‌గా న‌చ్చ‌ద‌నేది ఈ సమావేశం బాగా స్ప‌ష్టం చేసింది. త‌న ప‌నితీరు బాగాలేద‌ని ధైర్యం చేసి చెప్పడానికి మంత్రులు, ఎమ్మెల్యేలు కాస్తంత త‌ట‌ప‌టాయించారు. కానీ ఆయ‌న మాత్రం వాళ్ల ప‌నితీరు దారుణంగా వుంద‌ని, వాళ్ల‌మీద విసుక్కోవ‌డానికి అర‌నిమిషం ప‌ట్ట‌లేదు. ఇది వారి మ‌ధ్య సంబం ధాల‌ను బ‌ట్ట‌బ‌యలు చేసింది. పార్టీ టికెట్ ఇవ్వ‌డం, నిల‌బెట్ట‌డం గెల‌వ‌డానికి కావాల్సిన అన్ని స‌దుపా యాలు చేయ‌డం కూడా తానే చేస్తున్న‌పుడు త‌న మాటే వినాల‌ని, త‌ను అనుకున్న ఫ‌లితాలు సాధించ డానికి చ‌మ‌టోడ్చాల‌ని కండిష‌న్స్ పెట్ట‌డం ఎంత‌కాలం ఎవ‌రు భ‌రిస్తారు. ప‌థ‌కాల అమ‌లు ఇత‌ర అం శాల్లో ప్ర‌జ‌ల నుంచి వ‌స్తున్న వ్య‌తిరేక‌త‌, రాష్ట్ర‌ప్ర‌యోజ‌నాలు కాపాడ‌టంలో కేంద్రం నుంచి ఎలాంటి మ‌ద్ద తు కూడ‌గ‌ట్టుకోవ‌డంలో వెనుక‌బాటు అన్నీ ప్ర‌జ‌ల‌కు తెలియ‌వ‌నుకోవ‌డ‌మే జ‌గ‌న్ పొర బాటు. ప్ర‌జ‌లు ఓట్లు వేసి గెలిపించిన‌పుడు వారికి న‌చ్చ‌కుంటే సీఎం అయినా, మంత్రి, ఎమ్మెల్యేల‌యినా ఒక‌టే గ‌దా! మ‌రి ఎమ్మెల్యేలు, మంత్రులు ఎన్నిరోజులు వారి తాకిడిని త‌ట్టుకోవాలి. వారి వ్య‌తిరేక‌త‌ను, వారి ఆగ్ర‌హా వేశాలు, ప్రశ్న‌ల‌కు సీఎం నుంచి స‌మాధానం అడిగిన‌పుడు సానుకూల, ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో అన్ని చ‌ర్చించుకోవాలి.

అడ్డంకులు తొల‌గించ‌డానికి, ప్ర‌జ‌ల‌ప‌ట్ల ప్ర‌భుత్వానికి న‌మ్మ‌కం క‌లిగేందుకు  ఏమి చేయా ల‌న్న‌దీ మంత్రులు చేసుకోవాల‌ని ఆ్ర‌గ‌హించి ప్ర‌యోజ‌న‌మేమిటి?  అనేకానేక  అంశాల మీద అభిప్రాయాలు, ప్ర‌శ్న‌లు, అనుమానాలు వ‌చ్చిన‌పుడు వాటికి సీఎంగా, పార్టీ అధినేత‌గా స‌మాధానం చెప్ప‌డం, వారి ఆందోళ‌న‌ను దూరం చేయ‌డం అవ‌స‌రం. అది నా ప‌ని కాదు పొమ్మంటే వారి మ‌న‌సులో వున్న‌మాట‌ను గ‌ట్టిగా వినిపించేట్టే చెబుతారు. స‌రిగ్గా అదే వైసీపీ ఎమ్మ‌ల్యేలు, మంత్రులూ చేసారు. 

ఈ సమావేశానికి కారణం  రాష్ట్రంలో పార్టీ పరిస్థితి మెరుగుపరుచుకోవడం తెలుగుదేశం మహానాడు గొప్పగా జరగడం, అప్పటి నుంచి చంద్రబాబు నాయుడు, ఇతర తెలుగు తమ్ముళ్లు రెచ్చపోయి మాట్లాడుతుండ డం, గడప గడపకు ప్రభుత్వ కార్యక్రమంలో ప్రజల నుంచి నిరసనలు ఎదురుకావదు వంటి పరిణామాలు ముఖ్య మంత్రిని ఆలో చనలో పడవేశాయి. చెప్పిన ప్రకారం, చెప్పిన తేదీకి, చెప్పినంత మొత్తం నవ రత్నాల పేరుతో పంచిపెడుతున్నాను కాబట్టి, జనం తనను దేవుడి క్రింద ఆరాధించేర‌ని భావించా రా యన. ఎప్పుడు ఎన్నికలు జరిగినా గెలుపుకు ధోకా వుండదని నమ్మాడు. తెలుగుదేశం వంటి ప్రతిపక్షాలు అదృశ్యమై పోతాయని అంచనా వేసుకొన్నాడు. కానీ ప్రజలలో పరిస్థితి వేరొక రకంగా వుంటంతో ఎమ్మె ల్యేలను అర్జెంట్ గా సమావేశపరచారు.  తన మాట చెప్తే ఎమ్మెల్యేలు హడలిపోయి, పద్ధతులు మార్చు కొంటారు అనుకొన్నాడాయన.కానీ ఈ సమావేశం అట్లా ముగియలేదు.
మా సంగతి తర్వాత, ముందు మీరు నడుపుతున్నప్రభుత్వం పట్ల ప్రజల వైఖరి ఎట్లా వుందో తెలుసు కోండి అని ఎదురు బాణాలు సంధించారు ఎమ్మె ల్యేలు. కరెంట్, రోడ్లు, అమ్మఒడి వంటి అంశాలు
లేవనెత్తారు. ఇసుక దోపిడీని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి మాటలు వినకుండా తమలో తాము చర్చలకు దిగారు. ఆ చర్చలలో ప్రజలలో ప్రభుత్వం పట్లతీవ్రమైన వ్యతిరేకత వస్తున్నదని, దాన్ని సరిదిద్దుకో
వాలని ఉచిత సలహాలు ఇచ్చారు. ఈ తంతుచూసిన ముఖ్యమంత్రి మనసు నొచ్చుకొన్నది. ఒకరిద్దరు ఎమ్మెల్యేల మీద ఆ కోపం నేరుగానే వ్యక్తంచేశారు. ప్రజలలో నా గ్రాఫ్ బాగా వుంది, ఎమ్మెల్యేలుగా మీ తీరు బాగోలేనందు వల్లనే ప్రతి పక్షాలకు అవకాశం లభిస్తున్నదనే భావన వ్యక్తం చేశాడు. కానీ ఎమ్మెల్యేలు  ఆ అభిప్రాయంతో ఏకీభవించలేదు. ప్రభుత్వం మీదనే ప్రజలు తిరుగుబాటు ప్రకటిస్తున్నారనే  నిశ్చిత అభిప్రాయం ప్రకటించారు. మొత్తం మీద ఎమ్మెల్యేలను బెదరించడానికి సమావేశం జరిపితే, తననే భయపెట్టడాన్ని జీర్ణించు కోలేక పోతున్నాడు ముఖ్యమంత్రి. అందువల్లే ఎమ్మెల్యేలు అడిగిన ఏ ఒక్క కోరికను కూడా తీరుస్తానని హామీ ఇవ్వలేదు. ఆఖరకు ద్వార దర్శనానికి కూడా ఒప్పుకోలేదు.
ఈ సమావేశ ప్రతిపాదన తెచ్చింది ప్రశాంత్కి షోర్ తరఫున పార్టీ వ్యూహాలు రచిస్తున్న రిషి రాజాసింగ్. కనీసం 30 మంది ఎమ్మెల్యేలు మళ్లీగెలిచే అవకాశం లేదని నివేదిక ఇచ్చాడట ఆయన.పార్టీ పరిస్థితి వివరిస్తూ ఈ సమావేశంలో పవర్పా యింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చాడు. రేపటిఎన్నికలలో వైకాపాను గెలిపిస్తానని దాదాపు 500కోట్ల రూపాయల భారీ ఫీజుతో ఒప్పందం చేసుకొని వున్నాడట ప్రశాంత్ కిషోర్. ఒకవేళ పరిస్థితి వికటించినా తన తప్పు లేదు అని తప్పించుకోవడానికి ఇప్పటి నుంచే ఎమ్మెల్యేల మీద నెపం మోపుతున్నాడు. వారి వ్యూహం ప్రకారం సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు నిరాకరిస్తే, ఆర్థికంగా బల వంతులైవున్నవారు పార్టీని దెబ్బ తీయకుండా వదలి పెట్టరు. అట్లని వారికే మళ్లీ టిక్కెట్లు ఇస్తే జనం మెచ్చరు.ముందుకు పోవాలన్నా, వెనక్కు రావాలన్నా ఇరకాటం తప్పడం లేదు ముఖ్యమంత్రికి. మొత్తానికి వైకాపా అధినేతని ఒక వంక  పి.కె. ఆక‌ట్టుకుంటుంటే.. సిటింగ్ ఎమ్మెల్యేల సంగ‌తి ఆందోళ‌న పెడుతోంది.