ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే...అడగందే ఎవరూ ఏమీ ఇవ్వరు..
posted on Jan 27, 2018 10:03AM
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మరోసారి ప్రత్యేక హోదాని తెరపైకి వచ్చారు. ప్రత్యేక హోదా ఉంటేనే పెట్టుబడి దారులు మన వద్దకు వస్తారని.. ముఖ్యమంత్రి చంద్రబాబు మొహం చూసో లేదా తన మొహం చూసో రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలు ఎవరూ రానని.. పరిశ్రమలు, హోటల్స్, ఆసుపత్రులు, విద్యాసంస్థలు ఇలా ఏవైనా సరే నెలకొల్పేందుకు అనువైన పరిస్థితులు ఉన్నాయా? లేదా? అని మాత్రమే చూస్తారని అన్నారు. మన రాష్ట్రంలో అలాంటి అనుకూల పరిస్థితులు లేవని... మన రాష్ట్రలో పెట్టుబడులు పెట్టేముందు... హైదరాబాద్, చెన్నై, బెంగళూరు లాంటి అభివృద్ది చెందిన చెందిన ఆ ప్రాంతాలకే ఇన్వెస్టర్లు వెళ్లిపోతారని చెప్పారు. అందుకే రాష్ట్ర విభజనతో ఆర్థికంగా ఎంతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని అన్నారు. అడగందే ఎవరూ ఏమీ ఇవ్వరని... ప్రధాని మోదీని చంద్రబాబు కలిసి స్పెషల్ స్టేటస్ కోసం అడిగుంటే పరిస్థితి మరోలా ఉండేదని అన్నారు.