మరోసారి వార్తల్లోకి అమ్రపాలి....ప్రసంగంలో నవ్వులు...

 

వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి మరోసారి వార్తల్లో నిలిచారు. గణతంత్ర దినోత్సవం రోజున ఆమె ప్రవర్తిన తీరుపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. నిన్న రిపబ్లిక్ డే సందర్భంగా హన్మకొండ పోలీసు పరేడ్‌ మైదానంలో జాతీయ పతాకాన్ని ఎగరేసిన అనంతరం ఆమె ప్రసంగించారు. అయితే ఈ ప్రసంగంలో...ఆమె పదే పదే నవ్వడం..,.  గణాంకాల దగ్గర తడబడటం..  మధ్యలో 'ఇట్స్ ఫన్నీ అంటూ వ్యాఖ్యానించడం చేసింది. ఇదంతా మైక్ ఆన్ లో ఉండగానే ప్రసారమైంది. దీంతో అమ్రపాలిపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఒక ఐఏఎస్ అధికారి హోదాలో ఉన్న ఇలా వ్యవహరించడం....  ఎంతో హుందాగా.. అందంగా సాగాల్సిన కార్యక్రమంలో ఇలా ప్రవర్తించడం సరైంది కాదని... కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు...ఆమె ప్రసంగం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇప్పుడు ఈ విషయం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. మరి దీనికిగాను ఆమెపై చర్యలు తీసుకుంటారో.. లేదో..? ఏమవుతుందో చూద్దాం...?