'ఆటుపోట్లను ఎదుర్కొన్న పార్టీకి ఇదో లెక్క కాదు'
posted on Nov 20, 2011 12:39PM
తిరుపతి:
ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న కాంగ్రెసు పార్టీకి ఇదో లెక్క కాదని మంత్రి సాకె శైలజానాథ్ ఆదివారం చిత్తూరు జిల్లా తిరుపతిలో అన్నారు. వచ్చే శీతాకాల సమావేశాల్లో తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టినా ఎలాంటి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని అన్నారు.చంద్రబాబు అవిశ్వాసం పెడితే ఎదుర్కొంటామని దానిని ఎలా ఎదుర్కోవాలో తమకు తెలుసునన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వెంట ఉన్న తమ పార్టీ శాసనసభ్యులు అందరూ సొంతగూటికి తిరిగి వస్తారని అయన జోస్యం చెప్పారు .
ప్రత్యేక రాష్ట్రాల విషయంలో భారతీయ జనతా పార్టీది రెండు నాల్కల ధోరణి అని ధ్వజమెత్తారు. ఆ పార్టీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వాని మన రాష్ట్రానికి వచ్చినప్పుడు ప్రత్యేక తెలంగాణ అని ఉత్తర ప్రదేశ్‌లో మాత్రం వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు. ఒక జాతీయ నాయకుడు ఇలా మాట్లాడటం సరికాదన్నారు.