జగన్ వర్గ ఎమ్మెల్యేను దెబ్బ తీసే పనిలో మంత్రి

ఒంగోలు: ప్రకాశం జిల్లాకు చెందిన మున్సిపల్ శాఖ మంత్రి మహీధర్ రెడ్డి జిల్లాలోని వైయస్ జగన్ వర్గం నాయకులను దెబ్బ తీసే పనికి పూనుకున్నారు. జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డిని దెబ్బ తీసేందుకు ఆయన చర్యలు చేపట్టారు. బాలినేని శ్రీనివాస రెడ్డి కార్యకలాపాలను గమనిస్తూనే ప్రభుత్వ కార్యక్రమాల సమీక్ష పేరుతో మహీధర్ రెడ్డి చాలా రోజులు ఒంగోలులో తిష్ట వేశారు. ఎట్టకేలకు బాలినేనికి, జిల్లాపరిషత్ మాజీ చైర్ పర్సన్ కాటం అరుణమ్మ, ఇతర వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులకు సంబంధించిన కీలక ఫైళ్లను చేతుల్లోకి తీసుకున్నారు. కొత్తపట్నం మండంలోని చింతల గ్రామంలో, దాని పరిసరాల్లో వాళ్లు గత కొన్నేళ్లుగా పెద్ద యెత్తున భూములు కొనుగోలు చేశారు. విమానాశ్రయం ఏర్పాటుకు, వాన్‌పిక్ సెజ్‌లో పరిశ్రమల స్థాపనకు అప్పటికే ప్రభుత్వం పెద్ద యెత్తున కొనుగోలు చేసింది. దాంతో ఆ ప్రాంతంలో భూముల ధరలు పెరిగాయి. ఒంగోలుకు 8 కిలోమీటర్ల దూరంలో గల చింతల దాని చుట్టుపక్కల బాలినేని 500 ఎకరాలు, అరుణమ్మ వంద ఎకరాలు భూములు కొనుగోలు చేసినట్లు సమాచారం. అది మంత్రికి లక్ష్యంగా మారింది. చింతలలోని 30 ఎకరాల ప్రభుత్వ భూమిని ఒంగోలుకు చెందిన చెత్తను వేయడానికి అత్యాధునాతన డంపింగ్ యార్డు ఏర్పాటుకు కేటాయించాలని మంత్రి మహీధర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu