బాహుబలి రాకెట్ ప్రయోగం సక్సెస్
posted on Dec 24, 2025 9:00AM
.webp)
ఇస్రో మరో ఘన విజయం సాధించింది. అంతరిక్ష రంగంలో భారత్ మరో ముందడుగు వేసింది. శ్రీహరి కోటలోని షార్ నుంచి బాహుబలి రాకెట్ ను విజయవంతంగా ప్రయోగించింది. ఎల్‌వీఎం3-ఎం6 బాహుబలి రాకెట్ అమెరికాకు చెంది భారీ కమ్యూనికేషన్ ఉపగ్రహం బ్లూ బర్డ్ బ్లాక్-2ని నింగిలోకి తీసుకువెళ్లింది. ఈ ఉపగ్రహం బరువు దాదాపు ఆరువేల ఒక వంద కిలోలు. అమెరికాకు చెందిన ఏఎస్‌టీ స్పెస్ మొబైల్ సంస్థతో కలిసి ఇస్రో వాణిజ్య విభాగం న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ ఈ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. బుధవారం (డిసెంబర్ 24) ఉదయం 8:54 గంటలకు ఎల్వీఎం-3 ఎం-6 రాకెట్ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. అమెరికాకు చెందిన కొత్త తరం కమ్యూనికేషన్ ఉపగ్రహం బ్లూ బర్డ్ బ్లాక్-2ను కక్ష్యలోకి పంపారు.
ఈ ప్రయోగంతో ఇస్రో సరికొత్త రికార్డు నెలకొల్పింది. నిర్దేశిత కక్ష్యలో15.07 నిమిషాల్లో రాకెట్ మూడు దశలు పూర్తవగానే లో ఎర్త్ ఆర్బిట్ (లియో)లోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టనుంది. అమెరికాకు చెందిన ఏఎస్‌టీ స్పేస్ మొబైల్ సంస్థతో సంయుక్తంగా ఈ ప్రయోగాన్ని నిర్వహించింది. ఇంత పెద్ద ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రయోగించడం ఇస్రోకి ఇదే మొదటి సారి కావడం విశేషం.