ఆర్డనరీ బస్సులలోనూ ఏసీ.. చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాలలో ముందుకు దూసుకువెడుతోంది. సమతుల్య అభివృద్ధే లక్ష్యంగా చంద్రబాబు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే పునరుత్పాదక ఇంధన వనరుల నంగంలో భారీ పెట్టుబడులకు శ్రీకారం చుట్టారు.  గ్రీన్ ఎనర్జీ కంపెనీలు ఇప్పటికే ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్న సంగతి తెలిసిందే.  తాజాగా చంద్రబాబునాయుడు  రాష్ట్రంలో ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలు ఆసక్తికర విషయాన్ని తెలిపారు. రాష్ట్రంలో త్వరలో పెద్ద ఎత్తున ఎలక్ట్రికల్ బస్సులను తీసుకురానున్నట్లు తెలిపారు.   పల్లె వెలుగు  బస్సులతో సహా ప్రతి ఎలక్ట్రిక్ బస్సులో ఇప్పటి నుండి తప్పనిసరిగా ఏసీ సౌకర్యం ఉండాలన్నారు. 

వచ్చే ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం 1,450 ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయనుందని తెలిపారు.   పల్లె వెలుగు సహా రాష్ట్రంలోని అన్ని బస్సులలోనూ   ఇన్‌బిల్ట్ ఎయిర్ కండిషనింగ్ ఉండాలని చంద్రబాబు స్పష్టం చేశారు. పల్లె వెలుగు బస్సులు సహా ఆర్డనరీ బస్సుల ను కూడా ఎలక్ట్రిక్ వాహనాలుగా అప్‌గ్రేడ్ చేయడానికి, వాటిలో కూడా ఎయిర్ కండీషన్ అమర్చడానికి ఒక ప్రణాళిక రూపొందించినట్లు వివరించారు.   

Online Jyotish
Tone Academy
KidsOne Telugu