అమెరికాలో 30 మంది ఇండియన్స్ అరెస్ట్.. ఎందుకంటే?

అగ్రరాజ్యం అమెరికాలో 30 మంది ఇండియన్స్ ను అమెరికా బోర్డర్ పెట్రోల్ అధికారులు అరెస్టు చేశారు. వీరంతా అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నారంటూ ఈ అరెస్టులు జరిగాయి.  కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్సులతో భారీ సెమీ ట్రక్ వాహనాలను నడుపుతున్నట్లు గుర్తించినందున వీరిని అరెస్టు చేసినట్లు అమెరికా అధికారులు తెలిపారు.  

గత నెల 23 నుంచి ఈ నెల 12 వరకూ ఇంటర్ స్టేట్ హైవేలు,  ఇమిగ్రేషన్ చెక్‌పోస్టుల వద్ద జరిగిన తనిఖీల్లో మొత్తం 42 మంది అక్రమ వలసదారులను అదుపులోనికి తీసుకోగా, వీరిలో 30 మంది ఇండియన్స్ ఉన్నారు.  ఇండియన్  డ్రైవ‌ర్ల‌ కార‌ణంగా అమెరికాలో జ‌రిగిన‌ కొన్ని ప్రమాదాల్లో పలువురు మరణించగా, మరింత మంది తీవ్రంగా గాపడ్డారని అధికారులు తెలిపారు. సాధారణ కమర్షియల్ డ్రైవర్ లైసెన్సులతో భారీ సెమీ ట్రక్ వాహనాలను నడపడం నేరమన్న వారు,  ప్రజల భద్రతే మా ప్రథమ లక్ష్యమన్నారు. అందుకే స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించి అక్రమ వలసదారులను అరెస్టు చేస్తున్నట్లు తెలిపారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu