కొండాసురేఖపై పరువు కేసులో కెటీఆర్ స్టేట్ మెంట్ కీలకం?
posted on Oct 18, 2024 12:10PM
మంత్రి కొండాసురేఖపై పరువు నష్టం దావా వేసిన బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ స్టేట్ మెంట్ ను నాంపల్లి క్రిమినల్ కోర్టు రికార్డు చేయనుంది. ఈ కేసు సోమవారానికి వాయిదా పడటంతో కెటీర్ ఇచ్చే స్టేట్ మెంట్ మీద ఉత్కంఠ నెలకొంది.నాగచైతన్య, సమంత విడాకులకు కెటీఆర్ ప్రధాన కారణమని మంత్రి కొండాసురేఖ బాహాటంగా ఆరోపించిన సంగతి తెలిసిందే. కొండాసురేఖపై హీరో నాగార్జున పరువు నష్టం దావా వేశారు. బిఆర్ఎస్ ప్రోద్బలం వల్ల నాగార్జున కొండాసురేఖపై పరువు నష్టం దావా వేసినట్లు కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటుంది. నాగార్జున స్టేట్ మెంట్ ను రికార్డు చేసిన కోర్టు కెటీఆర్ వేసిన పరువు నష్టం దావాపై కూడ ఫిర్యాదిదారుడి స్టేట్ మెంట్ రికార్డు చేయనుంది. కొండాసురేఖ బాహాటంగా సమంతకు క్షమాపణలు చెప్పినప్పటికీ వివాదం సద్దుమణగక పోవడానికి కెటీఆర్ కారణమని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. తమ రాజకీయ ప్రయోజనాలకు ఈ వివాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్తుందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిన గత బిఆర్ఎస్ ప్రభుత్వం సమంత, రకుల్ ప్రీత్ సింగ్ లను బ్లాక్ మెయిల్ చేసిందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది.