ఇంటర్ మొదటి సంవత్సర ఫలితాలు విడుదల

ఇంటర్మీడియెట్ ఫస్ట్ ఇయర్ ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. మాధ్యమిక విద్యాశాఖమంత్రి పార్థసారధి ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 53.75 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులు అయినట్లు మంత్రి తెలిపారు. బాలుర ఉత్తీర్ణత శాతం 49.73 కాగా, బాలికలు 58.32 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈసారి కూడా ఫలితాల్లో బాలికలదే పైచేయిగా నిలిచింది. మార్కులు, గ్రేడ్ల వివరాలను 32 వెబ్‌సైట్లు, ఈసేవా కాల్‌సెంటర్ నంబర్లు, ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్, ఎస్.ఎం.ఎస్.ల ద్వారా తెలుసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి ఎం.సుబ్రమణ్యం ఒక ప్రకటనలో తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu