రంజాన్ ప్రార్థనలో పువ్వాడకు అవమానం!

రంజాన్ పర్వదినం రోజున మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కు అవమానం జరిగింది. రంజాన్ పురస్కరించుకొని ముస్లిం సోదరులు ఈద్గా మైదానంలో ప్రార్థనలు చేస్తున్నారు. ఇదే సమయంలో పువ్వాడ అజయ్ అక్కడికి చేరుకున్నారు. ప్రార్థనలో పాల్గొనే ముస్లిం సోదరులకు ప్రత్యేకంగా ఒక షామియానా వేశారు. ఈ షామియానా లో కేవలం ముస్లిం సోదరులే కూర్చోవాలని ఇతరులు వేరే షామియానాలో కూర్చోవాలని ముందుగానే నిర్ణయించుకున్నారు.

ఈ విషయం తెలియని అజయ్ ముస్లిం సోదరులకు ప్రత్యేకంగా వేసిన షామియాలోకి వెళ్లి కూర్చున్నారు. దీంతో ముస్లిం పెద్దలు అజయ్ ను అక్కడ నుంచి లేచి వెళ్లి మరో షామియానా కింద కూర్చోవాలని సూచించారు. దీంతో అజయ్ కాస్త ఇబ్బంది పడుతూ తాను మంత్రిగా ఉన్నప్పుడు ముస్లిం సోదరులకు , ఆ కమ్యూనిటీ కి ఎంతో సేవచేశానని చెబుతూ అక్కడి నుండి వెళ్లిపోయారు. కూర్చునే ముందు చెప్పకుండా కూర్చున్న తరువాత లేచిపోవాలని చెప్పడం అజయ్ అవమానంగా భావించి అక్కడ నుంచి వెళ్లిపోయారు.