చైనాకు మన భూమిని అమ్మేస్తున్న పాక్...
posted on Jun 6, 2017 3:54PM
.jpg)
పాకిస్థాన్, చైనా మధ్య ఉన్న స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈనేపథ్యంలోనే పాకిస్థాన్ మరోసారి బరితెగించింది. అక్రమంగా భారత్ భూమిని చైనాకు విక్రయిస్తోంది. 70 ఏళ్ల కిందట భారత్ నుంచి దొంగచాటుగా ఆక్రమించుకున్న గిల్గిత్-బాల్టిస్థాన్ లోని చాలా భాగాన్ని చైనాకు పాక్ విక్రయిస్తోంది. స్థానికులకు ఇష్టం లేకుండానే... ఈ భూములను చైనాకు కట్టబెట్టుతోంది. చైనా పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ పేరిట ఈ భూమిని అమ్మేస్తోంది. చైనాలోని పలు కంపెనీలకు, చైనా ఆర్మీకి భూములను అమ్మేస్తున్నారంటూ ఆ ప్రాంతంలోని జనాలంతా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటిలే వేలాది మంది గిల్గిత్-బాల్టిస్థాన్ ప్రజలు తమ భూములను కోల్పోయారు. ఈ ప్రాంతంలో చైనా, పాక్ సైన్యాలు ఉండేలా పెద్ద కంటోన్మెంటులు ఏర్పాటు చేసే ప్రయత్నం కూడా జరుగుతోందట.