ఐసిసి ప్లేయర్స్ ఆఫ్ ద మంత్...హర్మన్‌ప్రీత్, రిజ్వాన్
posted on Oct 10, 2022 5:12PM
భారత్ మహిళల క్రికెట్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, పాకిస్తాన్ వికెట్‌కీపర్ బ్యాటర్ మహమ్మద్ రిజ్వాన్ ఐసిసి ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డును గెలుచుకున్నారు. ఇంగ్లండ్ తో భారత్ తలపడిన వన్డే సిరీస్ లో హర్మన్ ప్రీత్ అద్బుత ప్రతిభ కనపరచిన సంగతి తెలిసిందే. ఐసిసి సెప్టెంబర్ నెల అవార్డు పోటీలో భారత్ వైస్ కెప్టెన్ స్మృతీ మంధాన, బంగ్లా కెప్టెన్ నిగర్ సుల్తానాలను హర్మన్ అధిగమించింది. వాస్తవా నికి వారిద్దరూ గత టోర్నీల్లో ఎంతో అద్భుత ప్రతిభ కనపరిచారు.
నిగర్, స్మృతీతో పోటీపడి ఈ అవార్డు గెలుచుకోవడం గొప్ప ఆనందాన్నిస్తోందని హర్మన్ ప్రీత్ అన్నది. ఇంగ్లండ్‌లో ఇంగ్లండ్ మీద వన్డే సిరీస్ గెలవడం భారత మహిళా క్రికెట్ చరిత్రలో ఎన్నదగ్గ విజయమని, అందుకు ప్రజలు, క్రికెట్ అభిమానుల నుంచి ఇప్పటికే శుభాకాంక్షలు అందుకున్నామని భారత్ కెప్టెన్ అన్నది. 1999 తర్వాత ఇంతటి ఘన విజయం సాధించడం అదే మొదటిసారి కావడం విశేషం. పైగా కెప్టెన్ గా ఆమెకు ఎంతో ప్రత్యేకం. ఈ సిరీస్ లో ఆమె 103.27 స్ట్రయిక్‌రేట్‌తో 221 యావరేజ్‌తో అత్యధి కంగా 221 పరుగులు చేసింది.
ఐసీసీఅవార్డుల పోటీలో భారత్‌స్పిన్నర్ అక్షర్ పటేల్, ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్రీన్‌లను అధిగమిం చాడు పాక్ ఆల్‌రౌండర్ రిజ్వాన్. సెప్టెంబర్‌లో జరిగిన టి20 ల్లో అద్భుత బ్యాటింగ్ ప్రదర్శించి అందరి దృష్టీ ఆకట్టుకున్నాడు. తన అవార్డును ఇటీవల పాకిస్తాన్‌లో భారీ వర్షాలకు కష్టాల్లో చిక్కుకున్న ప్రజలకు అంకితమిస్తున్నానని రిజ్వాన్ ప్రకటించాడు. సెప్టెంబర్‌లో పాక్ స్టార్ ఆడిన పది మ్యాచ్‌ల్లో ఏడు అర్ధ సెంచరీలు చేశాడు. ఆసియాకప్‌లో హాంకాంగ్, భారత్ ల మీద విజృంభించా డు. టోర్నీలో అత్యధిక స్కోర్ చేసిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు.
కాగా విజేతలు హర్మన్ ప్రీత్, రిజ్వాన్‌లు ఐసిసి నుంచి బంగారు పతకాలు అందుకుంటారు.