సీఎం జగన్‌కు బిగ్‌షాక్!.. ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాశ్ సంచలన నిర్ణయం?
posted on Aug 12, 2021 12:20PM
ప్రవీణ్‌ప్రకాశ్. సీఎం జగన్. ముఖ్య కార్యదర్శి. సీఎంవోలో ఆయనే కీలక అధికారి. ప్రవీణ్‌ప్రకాశ్‌కు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు జగన్. ఈయనతో విభేదాల వల్లే.. ఎల్వీ సుబ్రహ్మణ్యం సీఎస్ పదవిని కోల్పోవాల్సి వచ్చింది. సీఎస్ కంటే ప్రవీణ్‌కే ముఖ్యమంత్రి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారని అంటారు. ప్రభుత్వ వ్యవహారాలన్నీ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ప్రకాశ్ కనుసన్నల్లోనే జరుగుతాయని చెబుతారు. అత్యంత నమ్మకంగా ఉంటున్న ప్రవీణ్.. జగన్‌కు సడెన్ షాక్ ఇవ్వబోతున్నారని సమాచారం. త్వరలోనే ఆయన సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారని తెలుస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ముఖ్య కార్యదర్శిగా ఉన్న ప్రవీణ్ ప్రకాశ్ తన పదవికి రాజీనామా చేయనున్నట్టు ప్రచారం జరుగుతోంది.
అదేంటి? కీలక పదవిలో ఉన్న అధికారి సడెన్‌గా రాజీనామా చేయడమేంటి? జగన్‌తో విభేదాలే కారణమా? ముఖ్యమంత్రి తీరుతో విసుగెత్తే తన బాధ్యతల నుంచి వైదొలుగుతున్నారా? ఇలా అనేక అనుమానాలు. సీఎంవోలో ప్రవీణ్‌ప్రకాశ్ ఒంటెద్దు పోకడలతో ముఖ్యమంత్రి ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేశారని అంటున్నారు. తనకు తెలీకుండానే పలు జీవోలు విడుదలవడంపై సీఎం నిలదీశారని అంటున్నారు. మిగతా అధికారులతో సఖ్యత లేకపోవడం.. మోనోపాలిజంగా వ్యవహరిస్తుండటంపై సీఎం జగన్ మందలించారని చెబుతున్నారు. మరోవైపు, నిబంధనలకు విరుద్ధంగా ముఖ్యమంత్రి ఆయనపై పలు అంశాల్లో ఒత్తిడి తెస్తున్నారని.. అలా చేయడం కుదరదని చెప్పినా, చేయాల్సిందేనంటూ మండిపడుతుండటంపై ప్రవీణ్‌ప్రకాశ్ తెగ ఇబ్బంది పడుతున్నారని కూడా అంటున్నారు. గతంలో కొందరు ఐఏఎస్‌లు ముఖ్యమంత్రి చెప్పిన దానికల్లా తలాడిస్తూ.. చెప్పిన చోట గుడ్డిగా సంతకాలు చేయడం వల్ల ఇబ్బందులు పాలైన విషయం గుర్తెరిగే.. ప్రవీణ్‌ప్రకాశ్ కాస్త జాగ్రత్తగా ఉంటున్నారని.. సీఎం జగన్ చెప్పినా కొన్ని సంతకాలు చేసేందుకు ససేమిరా అంటుండటంతో.. వారిద్దరి మధ్య విభేదాలు వచ్చాయని.. అందుకే ఆయన పదవి వీడబోతున్నారని అంటున్నారు.
మరోవైపు, మరో వాదన కూడా వినిపిస్తోంది. ప్రవీణ్‌ప్రకాశ్ ముఖ్య కార్యదర్శి పదవి మాత్రమే కాకుండా ఏకంగా ఐఏఎస్‌కే రాజీనామా చేయబోతున్నారని అంటున్నారు. ఐఏఎస్ వదిలి.. రాజకీయాల్లోకి రావాలని చూస్తున్నారట. త్వరలోనే ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారని తెలుస్తోంది. అయితే, ఏపీలో కాదు యూపీలో. ఆ మేరకు ఆయన ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్నారని.. త్వరలోనే బీజేపీలో చేరుతారని.. వారణాసి నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారని అంటున్నారు.
జగన్‌తో విభేదాలు.. పొలిటికల్ ఎంట్రీ.. ఈ రెండింటిలో ఏ కారణం కరెక్టో త్వరలోనే క్లారిటీ రానుంది. రీజన్ ఏమైనా.. అతిత్వరలోనే ఐఏఎస్ ప్రవీణ్‌ప్రకాశ్ తన పదవికి గుడ్‌బై చెప్పడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది.