ఛత్తీస్ గఢ్ లో పేలిన మావోల మందు పాతర...9మంది జవాన్లు మృతి

గత కొంత కాలంగా ఛత్తీస్ గఢ్ కాల్పుల మోతలతో దద్దరిల్లిపోతున్నది. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్తంగా చేపడుతున్న ఆపరేషన్ తో మావోయిస్టుల కంచుకోట బద్దలౌతున్నది. గత కొద్ది నెలలుగా వరుసగా జరిగిన ఎన్ కౌంటర్లలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు హతమయ్యారు.

దీనికి ప్రతీకారమా అన్నట్లుగా తాజాగా ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ లో మావోయిస్టులు మందుపాతరతో 9 మంది జవాన్ల ఉసురు తీశారు. బీజాపూర్ లో  భద్రతా దళాలు ప్రయాణిస్తున్న వాహనాన్ని మావోయిస్టులు మందుపాతరతో పేల్చివేసిన ఘటనలో 9 మంది జవాన్లు మరణించారు. సంఘటన జరిగిన సమయంలో ఆ వాహనంలో 15 మంది జవాన్లు ఉన్నారు.