ప్రముఖ నటి రమ్యశ్రీపై కత్తితో దాడి
posted on Jun 17, 2025 9:11PM

ప్రముఖ నటి రమ్యశ్రీపై దాడి జరిగింది. ఆమె సోదరుడు ప్రశాంత్ వీడియో తీస్తున్నారని సంధ్యా కన్వెన్షన్ యజమాని శ్రీధర్ రావు అనుచరులు దాడికి పాల్పడ్డారు. హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్న ఎఫ్.సి.ఐ. లేఅవుట్లో ఓనర్స్ సమక్షంలో హైడ్రా అధికారులు రోడ్లు మార్కింగ్ చేశారు. వీడియో తీస్తున్న నటి రమ్యశ్రీ సోదరుడు పై సంధ్యా కన్వెన్షన్ యజమాని శ్రీధర్ రావు అనుచరులు దాడి ప్లాట్ యజమానురాలైన సినీనటి రమ్యశ్రీ, ఆమె సోదరుడు ప్రశాంతపై కత్తి, క్రికెట్ బ్యాట్ తో దాడికి పాల్పడ్డారు. శ్రీధర్ రావు అనుచరులు గాయాల పాలైన సినీనటి రమ్యశ్రీ, ఆమె సోదరుడు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీస్ స్టేషన్ ఎదురుగానే పట్టపగలు దుండగులు.. తమపై హత్యాయత్నం చేసేందుకు ప్రయత్నించారని సినీ నటి రమ్యశ్రీ వాపోయారు. సంధ్య కన్వెన్షన్ శ్రీధర్ రావు ఆగడాలకు అడ్డుకట్ట వేసే విధంగా పోలీసులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.