మావోల హిట్‌లిస్టులో పలువురు ప్రముఖులు

హైదరాబాద్: మావోయిస్టుల హిట్‌లిస్టులో పలువురు ప్రముఖులు ఉన్నారని తెలియడంతో కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగంలో ఆందోళన చెందుతోంది. మావో హిట్ లిస్టులో రాష్ట్రపతి ప్రతిభాపాటిల్, యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీతో పాటు పలువురు ప్రముఖులున్నారు. మావో క్యాంపులో ఇందుకు సంబంధించిన ఆధారాలు లభ్యమయ్యాయని పోలీసు వర్గాలు తెలిపాయి. వారి హిట్ లిస్టులో అమెరికా అధ్యక్షుడు ఒబామా కూడా ఉన్నారు. ఛత్తీస్‌ఘడ్‌లోని దొరాపార్, బొనొగ్రామ్ ప్రాంతాల్లో పోలీసులు, సీఆర్‌పీఎఫ్ దళాలు.. ఆది, సోమవారాల్లో కూంబింగ్ నిర్వహించాయి. బొనొగ్రామ్, నొందొగ్రామ్ వద్ద గల నక్సల్స్ శిబిరాలపై దాడులు చేశాయి. ఆ సమయంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. శిబిరాల్లోని పోస్టర్లు, డైరీలు, కాగితాలు, బాంబులు, మందుగుండు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu