పట్టు సాధించాలి అంటే పట్టుకోవడం రావాలి!

ఏ పని అయినా గ్రిప్ వచ్చిందంటే ఆ తరువాత చాలా సులభం అవుతుంది. కొంతమంది ఏదైనా మొదలుపెట్టి ఆ తరువాత నా వల్ల కాదు అని నీరసపడిపోయి వెనకడుగు వేస్తుంటారు. ఇది చాలా తప్పు. అలా చేస్తే అది మిమ్మల్ని మీరు సమస్యలోకి వెళ్ళకుండా చేస్తుందేమో కానీ జీవితంలో గొప్ప ఎదుగుదలను తుంచేస్తుంది.  విద్య, ఉద్యోగం, వ్యాపారం, వ్యక్తిగత విషయాలు ఇలా వర్గం ఏదైనా ప్రతి మనిషి కృషి లేనిదే మంచి స్థాయికి వెళ్లలేరు. 

కొంతమందికి కష్టపడాలి మంచి స్థాయికి వెళ్ళాలి అని ఉన్నా ఆ స్థాయికి చేరుకునే సరైన మార్గం తెలిసి ఉండదు. ఒక చెట్టు ఎక్కాలి అంటే దాని మీదకు సూపర్ మాన్ లాగా రాకెట్ స్పీడ్ తో ఎగిరి చెట్టు మీద కూర్చోలేమ్ కదా!! దానికి ఎక్కడ పట్టుకోవాలో, ఏ కొమ్మ మీద అడుగుతూ పెడుతూ ఇంకొంచెం పైకి ఎలా వెళ్ళాలో తెలిసి ఉండాలి. గోల్డ్ స్పూన్ తో పుట్టిన మహామహులు అయినా వాళ్ళ స్థాయిని తగ్గిపోకుండా కొనసాగించాలంటే కొన్ని తెలిసి ఉండాలి. 

వాటిని స్కిల్స్ అనచ్చు లేదా ఫార్ములాస్ అనచ్చు అదీ కాకుంటే మనపెద్దోళ్ళు చెప్పినట్టు బుద్ధి ఉపయోగించడం కావచ్చు. కానీ ఖచ్చితంగా కొన్ని అవసరం.

విద్యార్థులకు!

అవగాహన ఉండాలి. తాము చదువుతున్న వాటిలో తమకు ఇష్టమైన సబ్జెక్ట్, కష్టమైన సబ్జెక్ట్ అనేవి మాత్రమే కాకుండా ప్రస్తుత కాలంలో డిమాండ్ ఉన్నది, జీవితంలో తమకు ఎంతో గొప్ప తృప్తిని ఇవ్వగలుగుతుంది అనే వాటిని పరిగణనలోకి తీసుకోవాలి. ఒకదానితో సురిపెట్టుకోవాలనేమి లేదు కదా. కాబట్టి ఆల్ రౌండర్స్ అవ్వచ్చు. చదువుతున్నాం అంటే చదువుతున్నాం అన్నట్టు కాకుండా సబ్జెక్ట్ మీద ఇష్టం పెంచుకుని చదివితే అందులో ఉన్న మాటర్ చాలా ఈసీ గా అర్థమైపోతుంది. అలాగే కొన్ని కొండగుర్తులు, షార్ట్ కట్ వేస్ కూడా ఫాలో అవ్వచ్చు. ఎప్పటిదప్పుడు కవర్ చేస్తుంటే ఎక్సమ్స్ టైమ్ లో ఒత్తిడి ఉండదు.

ఉద్యోగం!

ఉద్యోగంలో ఎదగాలి అంటే అవకాశాలను పట్టుకోవడం రావాలి. యాజమాన్యాలు చెప్పే ప్రాజెక్టు లు, ఇతర పనులలో ఎంప్లాయ్ తన సామర్త్యాన్ని నిరూపించుకునే ఛాన్స్ ఉన్నవి ఉంటాయి. వాటిని నిరభ్యరంతంగా చేజిక్కించుకోవాలి. టీం వర్క్ లో చురుగ్గా ఉండాలి. వీలైన వరకు వర్క్ ను పెండింగ్ పెట్టకూడదు. ఒత్తిడిని పక్క ఉద్యోగుల మీద చూపించకూడదు. పర్సనల్ విషయాలను ఆఫీస్ లోకి తీసుకురాకూడదు. ఓవరాల్ గా ఎంత ఫ్రెండ్లీ గా అనిపిస్తారో వర్క్ విషయంలో అంతే సీరియస్ గా ఉండాలి. ఇలా ఉన్న వాళ్లే నేడు అంచెలంచెలుగా ఎదిగి సీఈఓ స్థాయిలకు చేరినవారు కూడా.

వ్యక్తిగత జీవితం!

చదువు ఉద్యోగానికి పూర్తిగా వ్యతిరేకమైనది వ్యక్తిగత జీవితం. ఇక్కడ తృప్తి కావాలి కానీ కమర్షియల్ కోణంలో ఎప్పుడూ ఆలోచించకూడదు. ముఖ్యంగా మన అనే ఫీలింగ్ ఉండాలి తప్ప నాది, నేను అనే అహంకారం పనికిరాదు. తల్లిదండ్రులు,  పిల్లలు, జీవిత భాగస్వామి, స్నేహితులు, చుట్టాలు ఇలా అందరికీ తగినంత సమయం అప్పుడప్పుడు ఇచ్చేయ్యాలి. ఫ్యామిలీ గొడవలు ఉన్నపుడు కాంప్రమైజ్ అయిపోవడం మంచిది. అహంతో సాగదీస్తే మనశాంతి పోతుంది. సమస్య ఎక్కువ ఉంటే ఆరోగ్యకరంగా డిస్కస్ చేసుకోవడం బెస్ట్. అంతేకానీ ఆ కొద్ధి సమయంలో ఒకరిమీద ఒకరు కంప్లైంట్ చేసుకోకుండా అందరినీ కలుపుకోవాలి. బంధువులు, స్నేహితుల ఇళ్లలో జరిగే శుభకార్యాలకు వీలైనంత వరకు అటెండ్ అవ్వడం బెస్ట్. ఆఫీస్ లో మీరు బెస్ట్ ఎంప్లాయీ అయితే తప్పకుండా మీకు పర్మిషన్ దొరుకుతుంది. అలాగని నెలకోసారి నాలుగురోజులు లీవ్ అడిగితే ఎవడూ ఇవ్వడు.

కాబట్టి దేంట్లో అయినా పట్టు రావాలి అంటే పట్టుకోవడం తెలిసి ఉండాలి మరి!!

◆ వెంకటేష్ పువ్వాడ.