హాయ్! ..పింకీ!
posted on Sep 27, 2022 11:33AM
క్లాసులోకి వెళ్లగానే మిన్నీ పుస్తకాలు తీసింది, చంటీ బ్యాగ్‌లోంచి లెక్కల హోంవర్క్‌నోట్స్ తీశాడు, రెండు బెంచీల అవతల కూచున్న మరో పిల్ల బ్యాగ్ తెరవగానే హలో అటూ ఏకంగా పాము పలకరిం చింది.. అంతే పిల్ల భయంతో గట్టిగా అరిచింది!
అసలు పుస్తకాల బ్యాగ్‌లోకి పెన్సిళ్లు, రబ్బర్లతో పాటు జామెట్రీ బాక్స్ ఉంటుందేగాని పాముగారు ఎలా వచ్చారబ్బా అని అంతా భయంతో కూడి ఆశ్చర్యంతో బ్యాగ్ వేపే చూస్తుండిపోయారు. అంతలో హెడ్ మాస్టర్‌కి తెలిసి పరుగున వచ్చారు. ఏమయిందో అని. ఎందుకు అందరూ అలా అరుస్తున్నా రన్నారు. అంతలో బ్యాగ్‌లో పాము సంగతి చెప్పేరు. ఆయన నోరెళ్లబెట్టారు. అవునా..! అన్నారు.
వెంటనే పాముల నర్సయ్యలాంటి హీరోకి ఫోన్ చేశారు. ఆయన మెరుపు వేగంతో వచ్చాడు. ఆయన మరో మాస్టరు సహాయంతో బ్యాగ్‌ని నెమ్మదిగా స్కూలు కి కొంత దూరం తీసికెళ్లి బాగా చెట్లు ఉన్న ప్రాంతంలో బ్యాగ్‌ని పూర్తిగా తెరిచి అలా పడేశారు. అంతే అందులో అప్పటిదాకా విశ్రాంతి తీసుకుంటున్న కోబ్రా కాస్తా ఎందుకు విసిగిస్తారని ఠపీమని తలెత్తి చూసింది. మాస్టారు కర్రతో కనిపించేసరికి అది కాస్తా చెట్లలోకి పారిపోయింది. అది చిన్నది కాదు ..కాటేస్తే ప్రాణాలే పోయేవి. పిల్ల అదృష్టవంతురాలు అన్నా రంతా!
మధ్యప్రదేశ్ షాజాన్‌పూర్ బదోనీ స్కూల్లో జరిగింది ఈ సంఘటన. మరంచేత పిల్లలూ, పుస్తకాలు పెట్టే సుకుని బ్యాగ్‌ని తగిలించుకోవడం కాకుండా ముందే బ్యాగ్‌ని శుబ్భరంగా దులిపి మరీ పుస్తకాలు సర్దుకోండి. లేదంటే క్లాస్‌రూమ్‌లో అందరూ భయంతో పరిగెట్టాల్సి వస్తుంది. బీ కేర్ ఫుల్! అంత భయ పడాల్సిన సమయంలోనూ ఓ కుర్రాడు వీడియో తీశాడు. అది ఇపుడు వైరల్ అయింది.