పోలవరం పూర్తికి పెద్ద పీట

కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్  తన బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు ప్రాధాన్యత ఇచ్చారు. అమరావతి అభిృద్ధికి 15 వేల కోట్ల రూపాయలు కేటాయించడమే కాకుండా, అవసరమైతే మరిన్ని నిధులు ఇస్తామని చెప్పారు.

అలాగే పోలవరం సత్వర పూర్తికి అగ్ర ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం అమలుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. 

ఇక విద్యార్థులకు దేశీయ విద్యాసంస్థలలో ఉన్నత విద్య కోసం పది లక్షల రూపాయల వరకూ రుణాలు అందిస్తామన్నారు. అలాగే నిరుద్యోగుల కోసం ప్రధాన మంత్రి ప్యాకేజీలో భాగంగా మూడు అనుసంధాన ప్రోత్సాహకాలు అందించనున్నట్లు చెప్పారు.   

Online Jyotish
Tone Academy
KidsOne Telugu