కోటి మందికి ఉద్యోగాలు... గ్రామాల మీద శ్రద్ధ...

దేశవ్యాప్తంగా వున్న 5 వందల పెద్ద కంపెనీలలో కోటి మంది యువకులకు ఉద్యోగాలు కల్పించనున్నట్టు కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మాలా సీతారామన్ ప్రకటించారు. వంద నగరాల్లో ప్లగ్ అండ్ ప్లే తరహా పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. 12 విస్తృత స్తాయి పారిశ్రామిక అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. పారిశ్రామిక ప్రాంతాల్లో  పనిచేసే కార్మికుల కోసం అద్దె గృహాల నిర్మాణం కూడా జరుపుతామన్నారు. పీపీపీ విధానంలో డార్మిటరీ తరహాలో ఇళ్ళ నిర్మాణం జరుపుతామని చెప్పారు.

అలాగే తాజా బడ్జెట్‌లో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం 2.66 లక్షల కోట్లను కేటాయించారు. ముద్ర రుణాల పరిమితి 10 లక్షల నుంచి 20 లక్షలకు పెంచారు. దేశీయ విద్యా సంస్థల్లో ఉన్నత విద్య కోసం విద్యార్థులకు 10 లక్షల వరకు రుణం ఇవ్వనున్నట్టు ప్రకటించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu