గాంధీభవన్ లో సందడి
posted on Apr 19, 2012 10:39AM
అధిష్టానం ప్రతినిధిగా హైదరాబాద్ విచ్చేసిన వాయలార్ రవి రాక వెనుకవున్న అసలు ఉద్దేశ్యం ఏమిటో ఎవరికీ అంతుబట్టడం లేదు. ఆంధ్రప్రదేశ్ ఇన్ ఛార్జీగా వ్యవహరించే గులాంనబీ ఆజాద్ బదులుగా రవి రావటం, పిసిసి భవన లో కూర్చొని నేతలందరితో సంపదిమ్పులు జరపడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కిందిస్థాయి నాయకుని మొదలు పిసిసి నేత వరకు ఎవరికీ వారు పిసిసి భవన కు వెళ్ళి పుష్పగుచ్చం ఇచ్చి, వంగి వంగి దండాలు పెట్టడం మినహా ఆయన రాకకు గల అసలు కారణం ఏమిటో నిర్థారించలేకపోతున్నారు. గాంధీభవన్ అంతా సందడి సందడిగా వుండటమే కాకుండా నేతలు ఎవరికీ వారు గుంపులుగా చెరి గుసగుసలాడుకొంటున్నారు.
రవితో కొంతమంది ప్రత్యేక తెలంగాణా ఉద్యమం గురించి మాట్లాడుతుంటే మరికొంతమంది నేతలతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పనితీరు, ఉప ఎన్నికలు, జగన్ పార్టీ ప్రభావం గురించి చర్చిస్తుండటంతో ఎవరికీ తోచిన అంచనాకు వారు వచ్చేస్తున్నారు. జగన్ అరెస్టు జరిగితే రాష్ట్రంలో రాజకీయంగా చోటు చేసుకునే మార్పుల గురించి కూడా ఆయన విచారాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. రవి తిరిగి ఢిల్లీ చేరుకున్న తర్వాత రాష్ట్రంలో పెనుమార్పులు సంభవించడం ఖాయమనే భావన వ్యక్తం అవుతోంది. ఆ మార్పు తెలంగాణాకు అనుకూలంగా వుంటుందని తెలంగాణా నేతలు భావిస్తుంటే కోస్తా నేతలు మాత్రం ముఖ్యమంత్రి మార్పు గురించి అంచనాలు వేస్తున్నారు.