ప్రతిరోజూ రెండు చిన్న లవంగాలు నమిలి గ్లాసుడు గోరువెచ్చని నీరు తాగితే జరిగే మ్యాజిక్ ఇదే..
posted on May 31, 2024 9:30AM
లవంగాలు వంటగదిలో ఉండే మసాలా దినుసు. ఇది వంటల్లోకే కాకుండా దగ్గు, జలుబు వంటి సమస్యలున్నప్పుడు కషాయం తయారుచేయడానికి కూడా ఉపయోగిస్తారు. ఆయుర్వేదంలో లవంగాలకు ఔషద స్థానం ఇచ్చారు. లవంగాలు ఆహారంలో భాగంగా తీసుకుంటే రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. ఇన్ఫెక్షన్లతో పోరాడటంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే విటమిన్-సి రక్తాన్ని శుద్ధి చేసి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది. లవంగం నూనెను ఉపయోగించడం వల్ల దంతాల ఆరోగ్యం బాగుంటుంది. ఇంత శక్తివంతమైన లవంగాలను ప్రతిరోజూ రెండు నమిలి తిని గోరువెచ్చని నీరు తాగితే అద్బుతాలు జరుగుతాయి. అవేంటో తెలుసుకుంటే..
రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది..
లవంగాలు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది , ఎందుకంటే ఇది శరీరంలోని తెల్ల రక్త కణాల పరిమాణాన్ని పెంచుతుంది. ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది. విటమిన్ సి లవంగాలలో లభిస్తుంది, ఇది ప్రతి ఒక్కరికి ఎంతో అవసరమైన విటమన్. లవంగాలలోని యాంటీ-వైరల్ గుణం రక్తాన్ని శుద్ధి చేసే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇది రక్తంలోని టాక్సిన్లను తగ్గిస్తుంది. తెల్ల రక్త కణాలను ప్రేరేపించడం ద్వారా వ్యాధులకు వ్యతిరేకంగా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రోజూ రెండు లవంగాలు తిని గ్లాసుడు గోరువెచ్చని నీరు త్రాగితే జరిగే మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి.
మలబద్దకం నుండి ఉపశమనం కలిగిస్తుంది..
లవంగం జీర్ణ సమస్యలకు చికిత్సగా ఉపయోగించవచ్చు, ఎందుకంటే ఇది జీర్ణ ఎంజైమ్‌ల స్రావాన్ని పెంచుతుంది, వికారం కూడా తగ్గిస్తుంది. ఇది కాకుండా, ఇందులో ఫైబర్ కూడా ఉంటుంది, ఇది జీర్ణక్రియకు మంచిదని, మలబద్ధకం సమస్యను తొలగిస్తుందని వైద్యులు చెబుతున్నారు.
పంటినొప్పిని దూరం చేస్తుంది..
లవంగాలలో మత్తు లక్షణాలు ఉంటాయి. పంటి నొప్పి ఉన్నప్పుడు తక్షణ ఉపశమనం పొందాలంటే లవంగాన్ని గ్రైండ్ చేసి అందులో కొద్దిగా ఆలివ్ ఆయిల్ కలపాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని దంతాలు, వాపు ఉన్న చిగుళ్లపై రాయాలి. 30 నిమిషాలు అలాగే ఉంచి, ఆపై ఉప్పు కలిపిన గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. లేదా లవంగాల నూనె కూడా ఉపయోగించవచ్చు. ఇవన్నీ కాకుండా ప్రతిరోజూ 2 చిన్న లవంగాలు నమిలి తిని గ్లాసుడు గోరువెచ్చని నీరు త్రాగితే అస్సలు పంటి నొప్పి, చిగుళ్ళ వాపు వంటి సమస్యలే ఎదురుకావు.
కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది..
మన శరీరాన్ని శుద్ది చేయడానికి, మనం తీసుకునే మందులను జీవక్రియ చేయడానికి కాలేయం బాధ్యత వహిస్తుంది. లవంగం నూనెలో ఉండే యూజినాల్ కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది. శరీరంలో నొప్పి, వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. ప్రతిరోజూ రెండు లవంగాలు తిని గోరువెచ్చని నీరు తాగితే కాలేయానికి సంబంధించిన సమస్యలే రావు.
నొప్పి, వాపు తగ్గిస్తుంది..
లవంగాలలో యూజీనాల్ అనే మూలకం ఉంటుంది, ఇది వాపును, నొప్పిని తగ్గిస్తుంది. ప్రతిరోజూ రెండు లవంగాలు తినడం అలవాటు చేసుకుంటే ఈ నొప్పులు, వాపులు ఆమడ దూరం ఉంటాయి.
ఎముకలు, కీళ్లకు మంచి మెడిసిన్..
లవంగాలలో ఫ్లేవనాయిడ్స్, మాంగనీస్, యూజినాల్ వంటి కొన్ని మూలకాలు ఉంటాయి, ఇవి ఎముకలు, కీళ్ల ఆరోగ్యానికి మంచివి. ఇవి ఎముకల మందాన్ని పెంచుతాయి, ఎముక కణజాలం ఏర్పడటానికి సహాయపడతాయి. అంతే కాదు ఎముకలకు ఆరోగ్యకరమైన ఖనిజాలను అందించడంలో కూడా సహాయపడుతుంది.
చక్కెర స్థాయిలు నియంత్రిస్తుంది..
ఇంట్లో ఎవరికైనా చక్కెర స్థాయి ఎక్కువగా ఉంటే, లవంగాలు శరీరంలో ఇన్సులిన్ లాగా పనిచేస్తాయి. ఇది రక్తం నుండి అదనపు చక్కెరను కణాలలోకి ఎగుమతి చేస్తుంది, మిగిలిన చక్కెరను సమతుల్యం చేస్తుంది. అందుకే చక్కెర వ్యాధి ఉన్నవారు , చక్కెర వ్యాధి కుటుంబంలో ఎవరికైనా ఉన్నవారు రోజూ రెండు లవంగాలు తిని, గోరువెచ్చని నీరు తాగడం మంచిది.
*నిశ్శబ్ద.