ఖాళీ కడుపుతో పచ్చి వెల్లుల్లి తింటే ఏం జరుగుతుందో తెలుసా?
posted on Jun 15, 2024 9:30AM
భారతీయులు చాలా వంటకాలలో ఎక్కువగా వినియోగించే పదార్థాలలో వెల్లుల్లి ఒకటి. ప్రతి వంటిట్లో వెల్లుల్లి తప్పనిసరిగా ఉంటుంది. వెల్లుల్లి వంటకు రుచిని, సువాసనను మాత్రమే కాదు.. ఆరోగ్యాన్ని కూడా చేకూరుస్తుంది. రోగనిరోధక శక్తి పెరగాలంటే వెల్లుల్లిని ఆహారంలో భాగం చేసుకోవాలని వైద్యులు చెబుతూ ఉంటారు. అయితే ప్రతి రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో పచ్చి వెల్లుల్లి తింటే అద్భుత లాభాలు ఉంటాయని వైద్యులు అంటున్నారు. వెల్లుల్లిలో కార్బోహైడ్రేట్లు, కాపర్, ఫాస్పరస్, డైటరీ ఫైబర్, ప్రొటీన్, పొటాషియం, ఐరన్, విటమిన్ సి, బి6, మాంగనీస్, క్యాల్షియం, సెలీనియం, ఫైబర్ మొదలైనవి పుష్కలంగా ఉన్నాయి. ప్రతిరోజూ ఖాళీ కడుపుతో 2 నుండి 3 వెల్లుల్లి రెబ్బలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుంటే..
ఇన్‌ఫ్లమేటరీ డిజార్డర్‌లను తొలగించడంలో వెల్లుల్లి చాలా మేలు చేస్తుంది. దీన్ని ఒక్కటి తింటే చాలు రోగనిరోధక శక్తి బలంగా మారుతుంది. ఇది శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
వెల్లుల్లి తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రక్తం గడ్డకట్టడాన్ని కూడా నిరోధిస్తుంది. ఇది గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
వెల్లుల్లిని తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ కూడా బలపడుతుంది. జీర్ణ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇది యాంటీమైక్రోబయల్ లక్షణాలను కలిగి ఉన్నందువల్ల జీర్ణశయాంతర వ్యాధులను తగ్గిస్తుంది.
పచ్చి వెల్లుల్లిని తినడం వల్ల కడుపులోని నులిపురుగులు మూత్రం, మలం సహాయంతో బయటకు వెళ్లిపోతాయి. ఇంకొక బెనిఫిట్ ఏంటంటే.. ఇది చెడు బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. పేగులోని మంచి బ్యాక్టీరియాను రక్షిస్తుంది.
పచ్చి వెల్లుల్లి రోజూ తినడం వల్ల లాభాలే కాదు.. నష్టాలు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే..
వెల్లుల్లి ప్రకోప ప్రేగు సిండ్రోమ్ (IBS) లేదా గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ (GERD)తో బాధపడుతున్న వ్యక్తులకు జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి వైద్యుల సలహా లేకుండా జీర్ణ సమస్యలు, ప్రేగు వ్యాధులు ఉన్నవారు తినకూడదు.
వెల్లుల్లిలో ఫ్రక్టాన్‌లు ఉంటాయి. ఇది ఒక రకమైన కార్బోహైడ్రేట్, ఇది ప్రకోప ప్రేగు సిండ్రోమ్ ఉన్నవారిలో గ్యాస్, ఉబ్బరం సమస్యలు కలిగిస్తుంది.
*రూపశ్రీ.