ఇక సూర్య ఎండీపై సీబీఐ విచారణ

హైదరాబాద్: ప్రముఖ తెలుగు దినపత్రిక సూర్య మేనేజింగ్ డైరెక్టర్ నూకారపు సూర్యప్రకాశ్‌ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ)  విచారించనున్నట్లుగా తెలుస్తోంది. పివిపి బిజినెస్ వెంచర్స్‌లోకి విదేశీ బ్యాంకు రుణాలు వచ్చిన అంశంపై ఈ విచారణ జరగనుంది. వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో సిబిఐ తన దర్యాఫ్తు కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా పివిపి వెంచర్స్‌లోకి నిధుల రాకపై సూర్య అధినేతను ప్రశ్నించనున్నట్లుగా ఓ తెలుగు టీవీ చానెల్ వార్తాకథనాన్ని ప్రసారం చేసింది. కాగా జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయ సాయి రెడ్డి ఏడో రోజు కూడా సిబిఐ అధికారుల ముందు హాజరయ్యారు. మరోవైపు అల్ఫా ఎవెన్యూ ప్రతినిధులు సిబిఐ ముందు హాజరయ్యారు. కాగా ఎమ్మార్ అక్రమాల కేసులోనూ సిబిఐ దర్యాఫ్తు కొనసాగిస్తోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu