చిన్నవయసులోనే జుట్టు బాగా రాలిపోతోందా? పోషకాలు లోపించినట్టే..!
posted on Sep 27, 2024 9:30AM
జుట్టు రాలడం అనేది ఒక సాధారణ సమస్య. యువత కూడా దీని బారిన పడుతున్నారు. 30 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు కూడా జుట్టు బలహీనత, జుట్టు రాలడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. కుటుంబంలో ఇప్పటికే ఈ సమస్య ఉన్నవారికి జన్యుపరంగా వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇది కాకుండా, జీవనశైలి, ఆహారానికి సంబంధించిన సమస్యలు కూడా జుట్టు రాలడానికి ప్రధాన కారణం అవుతాయి. ముఖ్యంగా కొన్ని పోషకాలు లోపిస్తే జుట్టు రాలడం అనే సమస్య ఎక్కువగా ఉంటుంది.
పోషకాలు..
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం విటమిన్-డి, విటమిన్-బి7 లేదా బయోటిన్, విటమిన్-ఇ, విటమిన్-ఎ వంటి పోషకాలు జుట్టుకు సమతుల ఆహారంగా పనిచేస్తాయి. వీటి లోపం వల్ల చిన్న వయసులోనే జుట్టు బాగా రాలిపోయి బట్టతల కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
జుట్టు వేగంగా రాలుతున్నా, జుట్టు బాగా రాలిపోతున్నా ఆహారంలో పోషకాలను తనిఖీ చేసుకోవాలి. దీని వల్ల జుట్టు రాలడానికి ఏం చేయాలి? ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలి? ఏం తినాలి అనే విషయాల మీద అవగాహన పెరుగుతుంది.
బయోటిన్ లోపిస్తే..
బయోటిన్ లేదా విటమిన్-బి7 లోపిస్తే జుట్టు, చర్మం, గోళ్లకు చాలా నష్టం కలుగుతుంది. జుట్టు, చర్మం, గోళ్ళ ఆరోగ్యానికి బయోటిన్ అవసరం. బయోటిన్ కెరాటిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. ఇది జుట్టు బలంగా, ఆరోగ్యంగా పెరగడానికి అవసరం. అలాగే బయోటిన్ లోపిస్తే వెంట్రుకలు పల్చబడటం, చిట్లడం కూడా జరుగుతుంది. తరచుగా మహిళలు గర్భం దాల్చడం, కొన్ని రకాల మందులు ఉపయోగించడం, కొన్ని రకాల ఆహారాలు తీసుకోవడం వల్ల కూడా జుట్టు రాలడం అనే సమస్య ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. బయోటిన్ పుష్కలంగా ఉన్న ఆహారం, లేదా బయోటిన్
విటమిన్-ఎ లోపిస్తే..
జుట్టు గ్రంధులలో సెబమ్ ఉత్పత్తిని పెంచడంలో విటమిన్-ఎ సహాయపడుతుంది. ఇది జుట్టును, స్కాల్ప్ ను తేమగా ఉంచడానికి అవసరం అవుతుంది. విటమిన్-ఎ లోపం ఉన్నవారిలో జుట్టు పొడిబారడం వల్ల జుట్టు బలహీనపడి జుట్టు రాలడం జరుగుతుంది. అయినప్పటికీ విటమిన్-ఎ లోపం అధికంగా ఉండటం వల్ల కూడా జుట్టు రాలడం జరుగుతుంది. మరొక విషయం ఏమిటంటే విటమిన్-ఎ శరీరంలో అవసరమైన దానికంటే ఎక్కువ ఉన్నా జుట్టు రాలడం జరుగుతుంది. కాబట్టి విటమిన్-ఎ సరైన మోతాదులో తీసుకోవాలి.