తల్లిదండ్రులను తిట్టే పిల్లలకు హైకోర్టు షాక్...

 

తల్లిదండ్రులపై నోరు పారేసుకునే పిల్లలకు ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. పిల్లలు పెద్దవారిని తిడితే తల్లిదండ్రులు వారిని భరించాల్సిన అవసరం లేదని, ఇంటి నుంచి బయటకు పంపించే హక్కు ఉంటుందని ఢిల్లీ హైకోర్టు ఓ సంచలన తీర్పు ఇచ్చింది. కొడుకులకే కాదు.. కూతుర్లకు కూడా వర్తిస్తుందని తెలిపింది. అంతేకాదు తల్లిదండ్రులు ఉంటున్న ఇల్లు వారి సొంతది కాకపోయినా ఈ హక్కు ఉంటుందని.. తల్లిదండ్రుల సంక్షేమం, నిర్వహణ, సీనియర్ సిటిజన్స్ చట్టం 2007లోని నిబంధనలను ఉటంకిస్తూ జస్టిస్ మన్మోహన్ ఈ విధంగా తీర్పు ఇచ్చారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu