గవర్నర్ ప్రసంగ పాఠం సారాంశం
posted on Feb 13, 2012 10:26AM
హైదరాబాద్: గవర్నర్ నరసింహన్ సోమవారం అసెంబ్లీలో ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించారు. ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలు. బడుగు బలహీన వర్గాలు, రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తన ప్రసంగంలో చెప్పారు. వామపక్ష తీవ్రవాదాన్ని ఎదుర్కోవడానికి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, రాష్ట్రంలో రాజకీయ, మతపరమైన హింస అదుపులో ఉందని చెప్పారు. 2015 నాటికి మాతా, శిశు మరణాలు తగ్గిస్తామని చెప్పారు. చేనేత కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. రాష్ట్ర ఆర్థిక ప్రగతికి, పేదరిక నిర్మూలనకు ప్రజాప్రతినిధులు అందరూ భాగస్వాములై ముందుకు నడిపించాలని, అందుకు ప్రజలు కూడా సహకరించాలని ఆయన కోరారు. అందరం సమష్టిగా రాష్ట్ర అభివృద్ధికి కృషి చేద్దామని చెప్పారు.
ప్రసంగంలోని ముఖ్యాంశాలు.
- హైదరాబాదుకు కృష్ణా, గోదావరి నీళ్లు హైదరాబాదుకు తెచ్చేందుకు కృషి
- రాష్ట్రంలో 9.22 శాతం అభివృద్ధి
- రాష్ట్రంలో 55 లక్షల గృహాలను నిర్మాణం
- 2015 నాటికి మాతా, శిశు మరణాల తగ్గింపుకు కృషి
- హైదరాబాదు, విజయవాడ, విశాఖలలో 1.10 లక్షల ఇళ్లు
- చైతన్య యాత్రల ద్వారా రైతుల్లో చైతన్యం తీసుకు వచ్చాం
- ఎస్సీ, ఎస్టీ, రైతులు, చేనేత వివిద వర్గాల సంక్షేమానికి కృషి
- ఉపాధి హామీ పథకంలో 1.23 కోట్ల మందికి జాబ్ కార్డులు జారీ
- విద్యుదుత్పత్తి, సరఫరాకు భారీ కేటాయింపులు
- ప్రపంచ బ్యాంకు సహకారంతో చిన్న నీటి వనరుల అభివృద్ధి
- 29.84 లక్షల పంపు సెట్లకు 7 గంటల ఉచిత విద్యుత్
- గ్రామీణ మహిళల ఆర్థికాభివృద్ధికి రూ.1000 కోట్ల రుణాలు
- యువతకు ఉపాధి కోసం రాజీవ్ యువకిరణాలు
- గిరిజిన విద్యాభివృద్ధికి ప్రాధాన్యత
- రాష్ట్రంలో రెండో మెగా ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ నిజామాబాదులో ఏర్పాటు
- రూ.400 కోట్లతో 732 ఆదర్శ పాఠశాలలు
- రాష్ట్రంలో రెండో పోర్టు ఏర్పాటు
- తిరుపతి విమానాశ్రయాన్ని అంతర్జాతీయస్థాయిలో తీర్చిదిద్దుతాం
- మున్సిపాలిటీలు 108 నుండి 161కి పెంపు
- ఆధార్ కింద 5 కోట్ల మంది నమోదు
- రాష్ట్రంలో 2వేల కిలోమీటర్ల రహదారులను హైవేలుగా చేసేందుకు ప్రయత్నం
- రాష్ట్రంలో రాజకీయ, మతపర హింసలు అదుపులో ఉన్నాయి
- ఏడేళ్లలో 5311 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యాన్ని సమకూర్చుకున్నాం.. 2012-13లో 880 మెగావాట్ల సామర్థ్యాన్ని అదనంగా చేర్చడానికి ప్రణాళిక
- మున్సిపాలిటీల్లో 100 రోజుల అభివృద్ధి కార్యక్రమం కింద రూ.700 కోట్లు ఖర్చు