దేవర సీన్ లీక్.. థియేటర్లు తగలబడిపోతాయి!

జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'దేవర' (Devara). సెప్టెంబర్ 27న విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ అంచనాలను రెట్టింపు చేసే న్యూస్ ఒకటి ఇండస్ట్రీ సర్కిల్స్ లో వినిపిస్తోంది.

టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ డైరెక్టర్స్ లో ఒకరిగా పేరు తెచ్చుకున్న కొరటాల.. తన గత చిత్రం 'ఆచార్య'తో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నాడు. అందుకే 'దేవర' సినిమాని ఎంతో కసితో చేస్తున్నాడు. ముఖ్యంగా తన గత చిత్రాలకు భిన్నంగా.. వయలెన్స్ డోస్ పెంచి, యాక్షన్ లవర్స్ ని టార్గెట్ చేస్తున్నాడు. రాజమౌళి, ప్రశాంత్ నీల్ వంటి దర్శకుల సినిమాలలో ఉండే.. హీరో ఎలివేషన్లు, యాక్షన్ సన్నివేశాలను మించేలా.. కొరటాల కొన్ని సీన్స్ ని ప్లాన్ చేశాడట. ముఖ్యంగా సముద్రతీరంలో ఉండే ఫైట్ సీన్ లో ఎన్టీఆర్ సృష్టించే రక్తపాతానికి సముద్ర ఎరుపెక్కడంతో పాటు.. థియేటర్లలో ప్రేక్షకులు పూనకాలతో ఊగిపోవడం ఖాయమని చెబుతున్నారు. ఇదే సీన్ లో ఒక పడవ నిండా శవాలను వేసుకొని, ఒడ్డుకి లాక్కొచ్చే షాట్ ఉంటుందట. ఈ ఒక్క షాట్ తో థియేటర్లు దద్దరిల్లడం ఖాయమని అంటున్నారు.

ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న 'దేవర' చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ కాగా, సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.