పిల్లలకు చిన్నతనంలోనే ఈ అలవాట్లు నేర్పిస్తే.. పెద్దయ్యాక ఎవరి మీద ఆధారపడరు..!

 


తల్లిదండ్రులుగా  పిల్లలకు ఇవ్వగల గొప్ప బహుమతి ఆరోగ్యకరమైన, సమతుల్య జీవనశైలి.  దీని కోసం పిల్లలకు తగిన  శక్తిని,  సమతుల్య జీవనశైలి మీద తగిన అవగాహనను పిల్లలకు కల్పించాలి. చిన్న వయస్సు నుండే సరళమైన, స్పృహతో కూడిన అలవాట్లను నేర్పించడం అనేది పిల్లల శారీరక, మానసిక శ్రేయస్సుకు పునాది వేస్తుంది.  అదే సమయంలో పిల్లల రోజును కూడా పర్పెక్ట్ గా ఉండేలా చేస్తుంది. పిల్లలకు సరైన దినచర్యను అందించి మంచి అలవాట్లు నేర్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంది.

ఆహారం..

పిల్లలు ముందుగా తమ కళ్లతో ఆహారాన్ని చూసి అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు. పిల్లల ప్లేట్‌లో రంగురంగుల ఆహారాన్ని చేర్చాలి . ఇందులో పండ్లు, కూరగాయలు, గింజలు,  విత్తనాలు మొదలైనవి ఉంటాయి. వివిధ ఆకారాలలో ఆహారాన్ని పెట్టడం వల్ల పిల్లలు ఆహారం పట్ల ఆకర్షితులవుతారు. ఆహారాన్ని ఇష్టంగా,  వృథా చేయకుండా తినడం అలవాటు చేసుకుంటారు.

యాక్టీవిటీ..

పిల్లలు సాధారణంగానే చురుగ్గా అల్లరి చేస్తూ ఆడుతూ ఉంటారు. అయితే వారిని సైక్లింగ్,  వాకింగా్,  డాన్స్ వంటి ఫిజికల్ యాక్టివిటీ ల వైపు ఆకర్షితులయ్యేలా తల్లిదండ్రులే చేయాలి.

నిద్ర..

పిల్లలు కొంతమంది రాత్రి సమయంలో నిద్రపోవడానికి ఇబ్బంది పడుతుంటారు.  రాత్రి నిద్రించడానికి ఇబ్బంది ఉంటే పడుకునే ముందు ప్రశాంతమైన దినచర్యను అలవాటు చేయాలి. వెచ్చని స్నానం చేయడం, తేలికపాటి సంగీతం వినడం, నిద్రవేళ కథ వినడం మొదలైనవి బిడ్డ రాత్రిపూట బాగా నిద్రపోవడానికి సహాయపడతాయి.ఇవి పిల్లల మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి.  బాగా నిద్ర పట్టేలా చేస్తాయి.

ఎమోషన్స్..

 “ఈ రోజు మీకు ఎలా అనిపిస్తుంది?”.. ఇాలాంటి ప్రశ్నను పిల్లలకు ఎప్పుడైనా వేశారా? ఇలాంటి ప్రశ్నలు పిల్లల ఎమోషన్స్ ను తెలుసుకోవడంలో సహాయపడతాయి.  భావోద్వేగాలను గుర్తించడానికి,  వ్యక్తీకరించడానికి పిల్లలకు ఇదొక మార్గం.  దీన్ని పిల్లలకు  నేర్పించడం చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరికి భావాలు ఉంటాయి.  వాటిని పంచుకోవడం ఎల్లప్పుడూ సరైందేనని అర్థం చేసుకోవడంలో వారికి సహాయపడాలి.

పని..

రోజువారీ కార్యకలాపాలను వారి స్వంతంగా చేయడం వలన పిల్లలు తమ అవసరాలపై తాము దృష్టి పెట్టడానికి సహాయపడుతుంది. పళ్లు తోముకోవడం, బాత్‌రూమ్‌కి వెళ్లడం, స్నానం చేయడం, దుస్తులు ధరించడం, తినడం.. ఇవన్నీ పిల్లలను వ్యక్తిగతంగా ఎదగడంలో సహాపడతాయి.  పిల్లల పనులు వారు చేసుకోవడం అలవాటు చేసుకుంటే వారి ప్రవర్తన కూడా మెచ్యురిటీగా మారుతుంది.  ఇలా పనులు చేసుకోవడాన్ని పిల్లలు  స్వాతంత్ర్యం గా భావిస్తారు.  ఇది వారిలో సెల్ఫ్ రెస్పెక్ట్ ను,  సెల్ఫ్ కాన్పిడెంట్ ను పెంచుతుంది.

                                       *రూపశ్రీ.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News