షిర్డీసాయి విగ్రహాలు ఎందుకు పాలుతాగుతున్నాయి?

గురుత్వాకర్షణ శక్తి వల్ల షిర్డీసాయి విగ్రహాలు పాలు తాగాయని విజ్ఞానశాస్త్రవేత్తలు, బీఇడి కళాశాల ప్రిన్సిపాల్‌ తదితరలు వివరిస్తున్నారు. కాదు, ఇది నిజంగా సాయి మహిమే అని భక్తులు నమ్ముతున్నారు. అంతేకాకుండా చూడండని పిలిచి సాయివిగ్రహాలకు పాలు తాగిస్తున్నారు. ఇది అనంతపురం జిల్లాలోని హిందూపురం, లేపాక్షి, పరిగి మండలాల్లో అద్భుతదృశ్యంగా పలువురిని ఆకట్టుకుంటోంది. జనాలు తండోపతండాలుగా పాలు కొనటం సాయివిగ్రహానికి తాగిస్తూ ఆనందిస్తున్నారు. ఈ విషయం తెలియని వారికి వివరించి మరీ ఈ వింతను చూపిస్తున్నారు.


 

గతంలో వినాయక విగ్రహాలు పాలుతాగినట్లే సాయి విగ్రహాలు ఈ జిల్లాలో పాలుతాగాయి. హిందూపురం పట్టణంలోని పలుప్రాంతాల్లో ఎక్కడ చూసినా సాయి విగ్రహం పాలుతాగుతోందన్న అంశంపైనే చర్చ నడుస్తోంది. లేపాక్షి మండలం కూరాకుపేటలో మహిళలు కలిసికట్టుగా వచ్చి బాబా విగ్రహాలకు పాలు తాగించి భజనలు చేశారు. పరిగిలోని సాయిసేవామందిర్‌ప్రాంతంలోనూ ఒకటే హడావుడిగా కనిపించింది. కర్నాటక రాష్ట్రంలోని పావగడలో కూడా ఇదే విషయమై ఆసక్తి నెలకొంది. ఏమైనా సాయి మహిమ వర్ణించలేమని ఆయన భక్తులు కీర్తిస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu