బరితెగిస్తున్న ఇసుక మాఫియా ?

రాష్ట్రంలో ఇసుక మాఫియా బరితెగిస్తోంది. తాజాగా మహబూబ్‌ నగర్‌ జిల్లా మక్తల్‌ ఎం.ఎల్‌.ఎ. దయాకర్‌ రావు ఇసుక మాఫియా ఆగ్రహానికి గురయ్యారు. ఇసుక కోసం హత్యలు చేసేందుకు కూడా మాఫివయా ముటాలు వెనుకాడడంలేదు. అక్రమంగా ఎందుకు ఇసుక తరలిస్తున్నారని పోలీసులు ఆపేయటంతోనూ, రెవెన్యూ శాఖ దాడులు చేయడంతోనూ తవ్వకందార్లు ఎంతకైనా తెగిస్తున్నారు. రాష్ట్రంలో భారీగా నిర్మాణాలు జరుగుతున్న సమయంలో ఇసుక రవాణా కోర్టు తీర్పుకారణంగా ఆపేశారు. దీన్ని స్థిరీకరించేందుకు కోర్టు కానీ, అధికారులు కానీ ఎక్కువగా చొరవ చూపకపోవటంతో అక్రమమార్గాల్లో ఇసుకను తరలిస్తున్నారు. ఎక్కువ డబ్బు పోసి ఇసుకను కొనుక్కుని నిర్మాణాలు చేపట్టలేమని బిల్డర్లు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

 

దొంగచాటుగా ఇసుక కొంటే కేసులు, ఫైనులు కూడా కట్టాల్సివస్తోందంటున్నారు. దీంతో రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇసుక ఒక కీలకమైన సమస్యగా మారింది. ఖమ్మం జిల్లాలో గోదావరి ఇసుకను రెండు ట్రాక్టర్లలో తరలిస్తుంటే రెవెన్యూశాఖ దాడులు చేసి కేసులు నమోదు చేసింది. అలానే తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం సమీపంలోనూ ఇసుకరవాణాదారులపై కేసులు నమోదయ్యాయి. తాజాగా మహబూబ్‌నగర్‌ జిల్లా మక్తల్‌ ఎమ్మెల్యే దయాకర్‌రావు ఇసుకమాఫియా బెదిరింపులను ఎదుర్కొన్నారు. కేవలం రెండు లోడుల ఇసుకను అక్రమంగా ఎందుకు తరలిస్తున్నారని ఆయన ప్రశ్నించినందుకు బెదిరింపులు ఎదురయ్యాయి. దీనిపై దేవరకద్రపోలీసుస్టేషనులో ఎమ్మెల్యే మాఫియాపై కేసు పెట్టారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu