కిషన్ రెడ్డి స్టయిలే వేరు.. బొకేలు వద్దు, బుక్స్ ముద్దు

 

నాయకులు ఎన్నికల్లో గెలిస్తే.. వారిని కలిసి అభినందించడానికి వచ్చే నేతలు, అభిమానులు.. పూలదండలు, బొకేలతో వస్తారు. అయితే పూలదండలు, బొకేలు కేవలం ఫోటోలు దిగుతున్నంత సేపే తప్ప.. తరువాత వాటిని పక్కన పడేయడమే. వాటితో ప్రయోజనం ఉండదు. అయితే ఈ విషయంలో.. సికింద్రాబాద్ ఎంపీగా గెలిచిన బీజేపీ సీనియర్ కిషన్ రెడ్డి వినూత్నంగా ఆలోచించారు. తనను కలిసేందుకు వచ్చే నేతలు, అభిమానులు.. పూలదండలు, బొకేలకు బదులు పుస్తకాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దీంతో అభిమానులు పెద్ద ఎత్తున నోట్ బుక్స్ తీసుకొస్తున్నారు. వాటిని కిషన్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలు, అనాధాశ్రమాల్లో పంచుతున్నారు. కిషన్ రెడ్డి ఆలోచనకి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu