ఉక్రెయిన్ పిల్లలకు 12 ఏళ్ల అన్న దొరికాడు.. గాబ్రియేల్
posted on Jul 20, 2022 6:47AM
కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయాలని అందరికీ ఉంటుంది. కానీ కొందరే నిజంగా ముందడుగు వేస్తారు. ఆలోచించడం, అనుకోవడం కంటే అనుకున్నది వెంటనే కార్యాచరణలో పెట్టడం చాలా గొప్పది. అందులోను గాబ్రియెల్ వంటి మనసున్నవారు ఉ్రకెయిన్ పిల్లలకు సహాయం చేయాలనుకోవడం మరీ అరుదు. గాబ్రియెల్ 12 ఏళ్లవాడు. ఉక్రెయిన్ పిల్లలకు తన వంతు సహా యంగా 109,400 డాలర్లకు పైగా వసూలు చేసింది ఉక్రేనియన్ పిల్లల కోసం పంపించాడు.
గాబ్రియెల్ క్లార్క్ అనే పిల్లవాడు చెక్కపనులు చేస్తుంటాడు. ప్లేట్లు, మంచి డిజైన్‌లో వస్తువుల్ని చేయడంలో నైపుణ్యం సాధిం చాడు. ఇంగ్లాండ్ కుంబ్రియాకు చెందిన గాబ్రియెల్ ఎనిమిదో ఏటనే అందమైన వస్తువుల తయారీ పట్ల దృష్టి మళ్లింది. అతని తల్లి తన తాత ఉపయోగించే సుత్తిని అతనికి అందించింది. చెక్కతో చిన్న చిన్న వస్తువులు చేయడం నేర్చుకున్న గాబ్రియెల్ ఇపుడు ఎంతో చక్కటి వస్తు వులను తయారు చేసే ఒక సంస్థలో పనిచేస్తున్నాడు.
ఈమధ్య ఉక్రెయిన్‌పై రష్యా దాడి గురించి అందరికీ తెలిసినట్లే ఈ కుర్రాడికి తెలిసింది. వార్తలు చూస్తూ, వింటూండటంతో మనసు బరువెక్కింది. అయ్యో తన వయసు పిల్లలకు ఇన్ని కష్టాలు వచ్చాయా అనుకున్నాడు. తన వంతు ఏదయినా సహాయం చేయాలని నిశ్చయించుకున్నాడు. జీవితంలో ఏదైనా చేయడం ద్వారా నేను ఇతర పిల్లల జీవితాలను మెరుగు పరచగలనని నేను తెలుసుకోవా లనుకుంటున్నా నని గాబ్రియేల్ తన స్నేహితులు, తోటి పనివారితో అంటూండే వాడు. చిన్న వయసులోనే ఇంతటి పెద్ద ఆలోచన చేయడం నిజంగా ఎంతో హర్షణీయం. నాకు తెలిసిన ప్రతిదాన్ని నేను స్వయంగానే నేర్చుకున్నాను. కుంబ్రియా పాఠశాల విద్యార్థికి కూడా మంచి చేయాలనే సహజమైన కోరిక ఉంది, దానిని అతను ఈ వసంత కాలంలో అమలులోకి తెచ్చాడు.
మార్చి 25న, గాబ్రియేల్ తండ్రి, రిచర్డ్ క్లార్క్, తన కుమారుడి నైపుణ్యం గురించి, తన చేతితో తయారు చేసిన చెక్క గిన్నెలు కటింగ్ బోర్డుల అమ్మకాల నుండి డబ్బును ఎలా ఆదా చేస్తున్నాడో ట్వీట్ చేశాడు. పోస్ట్ వైరల్ అయ్యింది గాబ్రియెల్ కుటుంబం కస్టమ్ బౌల్స్ కోసం వేలకొద్దీ ఆర్డర్‌లను అందుకుంది 48 గంటల్లో ఆరుగురు అనుచరుల నుండి రెండు లక్షలకు పైగా చేరుకుంది.
గాబ్రియేల్ తనకు కొత్తగా వచ్చిన ప్రజాదరణను ఇతరులకు సహాయం చేసే అవకాశంగా మార్చుకోవాలని నిర్ణయించుకు న్నాడు. ప్రతిభావంతులైన, యువ హస్తకళాకారుడు ఇటీవల తన చేతితో తయారు చేసిన గిన్నెలలో ఒకదాని కోసం ఒక లాటరీని ప్రారం భించాడు - నీలంపసుపు ఉంగరం, ఉక్రెయిన్ జెండా రంగులతో చెక్కబడి - ఉక్రేనియన్ పిల్లల కోసం డబ్బును సేకరించ డానికి. గాబ్రియేల్ సేవ్ ది చిల్డ్రన్స్ ఉక్రెయిన్ సహాయ చర్య కోసం 109,450 డాలర్లకు మించి సేకరించాడు.